ఆల్ టైమ్ ‘మన్మథుడు’.. హ్యాపీ బర్త్‌డే ‘కింగ్’ నాగ్..

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 12:08 PM IST
ఆల్ టైమ్ ‘మన్మథుడు’.. హ్యాపీ బర్త్‌డే ‘కింగ్’ నాగ్..

#HBDKingNagarjuna: కింగ్ నాగార్జున సెప్టెంబర్ 29న తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సిక్స్టీలోనూ ట్వంటీ ప్లస్‌లా కనబడడం అక్కినేని అందగాడికే సాధ్యం అని కొత్తగా చెప్పనవసరం లేదు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.



కెరీర్ స్టార్టింగ్‌లో మాస్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, ప్రేమకథలు చేసినా.. ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా, ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా.. వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ, నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ అసలు సిసలు అక్కినేని నట వారసుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు చూరగొన్నారు.Nagarjuna‘గీతాంజలి’ లాంటి విషాదాంత ప్రేమకథతో సంచలనం సృష్టించినా, ‘శివ’గా సైకిల్ చైన్ లాగి ట్రెండ్ సెట్ చేసినా, ‘హలో బ్రదర్‌’గా అలరించినా, ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని చూరగొన్నా, ‘అన్నమయ్య’గా కీర్తనలు ఆలాపించి అవార్డులనందుకున్నా, ‘మన్మథుడు’గా ముద్దుగుమ్మలను మెస్మరైజ్ చేసినా, ‘మాస్’ అంటూ చేతులు మడతపెట్టినా, ‘కింగ్’ అంటూ కాలర్ ఎగరేసినా, ‘శ్రీరామదాసు’గా భక్తిపారవశ్యంలో ముంచెత్తినా, ‘మనం’గా మదిలో నిలిచిపోయినా, ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ సరసాలాడినా, సినిమానే ‘ఊపిరి’గా ప్రయోగాలు చేసినా.. అది ఒకే ఒక్క ‘అక్కినేని నాగార్జున’కు మాత్రమే సాధ్యం..
https://10tv.in/c-u-soon-releasing-on-1st-september/
తన సినిమాకు తానే న్యాయనిర్ణేత.. సినిమా నచ్చకపోతే చూడొద్దు అంటూ అభిమానులకు మొహమాటం లేకుండా చెప్పే హీరో నాగ్ ఒక్కరే.. ఆయన చేసిన ప్రయోగాలు అనేకం, ఆయన కీర్తి అనంతం.. నాగ్ పరిచయం చేసినంతమంది దర్శకులను తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరో కూడా ఇంట్రడ్యూస్ చేసిఉండరు. వయసు పెరిగినా వన్నె తరగని నిత్య యవ్వనుడు, ప్రేక్షకుల మనసులు దోచుకున్న “మన్మథుడు”.. అమ్మాయిల్ని కలలో కవ్వించే “గ్రీకువీరుడు”.. అందంతో ఆడాళ్ళని అసూయ పడేలా చేసిన రాకుమారుడు.. అక్కినేని అందగాడు.. సినీ సామ్రాజ్యానికి “కింగ్” ఆయన..Nagarjunaరెండు సార్లు జాతీయ అవార్డులు(బెస్ట్ యాక్టర్ జ్యూరీ-“అన్నమయ్య”, నిర్మాతగా “నిన్నేపెళ్లడతా”), 9 సార్లు రాష్ట్ర ప్రభుత్వంచే నంది అవార్డులు, 3 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఆర్య ప్రసాద్, అఖిలేష్ చీదెళ్ల డిజైన్ చేసిన కింగ్ బర్త్‌డే DP, మోషన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.



సినిమాల విషయానికొస్తే “వైల్డ్ డాగ్”(Wild Dog), “సోగ్గాడే చిన్నినాయనా” ప్రీక్వెల్ “బంగార్రాజు”తో పాటు ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే వరుసగా రెండోసారి అతిపెద్ద రియాలిటీ షో “బిగ్‌బాస్-4″కి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు కింగ్ నాగార్జున.Nagarjuna