కరోనాపై పోరుకు నడుంబిగించిన నిఖిల్

కరోనా ఎఫెక్ట్ : డాక్ట‌ర్స్‌, పారిశుద్ధ్య కార్మికుల కోసం యువ నటుడు నిఖిల్ సాయం..

  • Published By: sekhar ,Published On : March 28, 2020 / 03:04 PM IST
కరోనాపై పోరుకు నడుంబిగించిన నిఖిల్

కరోనా ఎఫెక్ట్ : డాక్ట‌ర్స్‌, పారిశుద్ధ్య కార్మికుల కోసం యువ నటుడు నిఖిల్ సాయం..

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలు పెరుగ‌ని పోరాటం చేస్తున్నాయి. ఇప్ప‌టికే దేశ‌మంత‌టా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. సినీ ప్ర‌ముఖులంద‌రూ త‌మ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పుడు యువ క‌థానాయ‌కుడు నిఖిల్ త‌న వంతుగా సాయం అందించ‌డానికి ముందుకు వ‌చ్చాడు. క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్న‌ వారిలో డాక్ట‌ర్స్‌, పారిశుద్ధ్య కార్మికులు ముందు వ‌రుస‌లో ఉన్నారు.

వారి కోసం నిఖిల్ 2000 రెసిపిరేట‌ర్స్‌, 2000 రి యూజ‌బుల్ గ్లౌవ్స్‌, 2000 గ్లాసెస్‌(ఐ ప్రొటెక్ష‌న్‌), మరియు 2000 శానిటైజర్స్, 10000 మాస్కుల‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో హాస్పిట‌ల్స్‌, ఐసోలేష‌న్స్ వార్డ్స్‌లోని డాక్ట‌ర్స్ ఇత‌ర సిబ్బందికి అంద చేస్తున్న‌ట్లు తెలియ‌జేశాడు.