Samanyudu: టాలీవుడ్ బాక్సాఫీస్ రాసిచ్చినా నిలబడని విశాల్!

కరోనా పాండమిక్ ఎండింగ్ స్టేజిలో ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ ఉదృతి ఎక్కువగానే ఉండడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో మూవీ..

Samanyudu: టాలీవుడ్ బాక్సాఫీస్ రాసిచ్చినా నిలబడని విశాల్!

Samanyudu

Samanyudu: కరోనా పాండమిక్ ఎండింగ్ స్టేజిలో ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ ఉదృతి ఎక్కువగానే ఉండడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో మూవీ థియేటర్లు యాభై శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా చాలా రాష్ట్రాలలో ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. దీంతో స్టార్ హీరోల సినిమాలన్నీ ల్యాబులలోనే ఉండిపోయాయి.

Film Directors: బీవీఎస్ రవి-హరీష్ శంకర్ ట్విట్టర్ వార్.. అసలేం జరిగింది?

సంక్రాంతికి తెలుగులో అక్కినేని హీరోలు బంగార్రాజుగా థియేటర్లలోకి రాగా ఆ తర్వాత కీర్తి సురేష్ గుడ్ లక్ సఖిగా వచ్చేసింది. అయితే.. ఈ వారం అది కూడా లేదు. ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో తమిళంలో స్టార్ గా ఎదిగిన తెలుగు హీరో విశాల్ సోలోగా ఈ వారం వచ్చేశాడు. ఒక్క తెలుగు సినిమా కూడా లేకుండా గంప గుత్తాగా టాలీవుడ్ బాక్సాఫీస్ ను విశాల్ కి రాసిచ్చేశారు. ఇది విశాల్ కి నిజంగా జాక్ పాటు ఛాన్స్.

New Films Launch: రెడీ.. యాక్షన్ బాబు.. కొత్త సినిమాలతో స్టార్స్ బిజీ

అయితే, విశాల్ ఈ బంపర్ ఆఫర్ ను వినియోగించుకోలేకపోయినట్లు తేలిపోయింది. సామాన్యుడు సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. సినీ విశ్లేషకులు సైతం ఈ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. దీంతో రాకరాక వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా విశాల్ వినియోగించుకోలేకపోయినట్లుగా కనిపిస్తుంది. కరోనా కారణంగా సినిమాలన్నీ పేరుకుపోయిన ఇలాంటి సమయంలో సోలోగా ఎలాంటి పోటీ లేకుండా సినిమా రిలీజ్ కావడం గగనంగా తరుణంలో ఎలాంటి పోటీ లేకుండా అవకాశం ఇచ్చినా విశాల్ దాన్ని వినియోగించుకోలేకపోవడం బ్యాడ్ లక్.