Rashmika : సిగరెట్లు తాగను..వారు పక్కన నిల్చొన్నా ఇష్టం ఉండదు

సోషల్ మీడియా ద్వారా..అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు వివిధ ప్రశ్నలు అడిగారు. అయితే..ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రష్మిక ఖంగుతిన్నారు.

Rashmika : సిగరెట్లు తాగను..వారు పక్కన నిల్చొన్నా ఇష్టం ఉండదు

Rashmika

Rashmika Smoking : టాలీవుడ్ సినిమాల్లో రష్మిక నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె..స్టార్ హీరోయిన్ రేసులో దూసుకపోతున్నారు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ…విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేశారు. ఈ హీరోతో కలిసి మరో సినిమా డియర్ కామ్రేడ్ సినిమాలో చేశారు.

ఈమె సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటారు. సినిమాకు సంబంధించి, ఇతరత్రా వార్తలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇలాగే…సోషల్ మీడియా ద్వారా..అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు వివిధ ప్రశ్నలు అడిగారు. అయితే..ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రష్మిక ఖంగుతిన్నారు.

రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు ? అంటూ ప్రశ్నించాడు. దీనిపై రష్మిక సీరియస్ అవుతుందని ఊహించారు. కానీ..అలాంటిదేమి జరగలేదు. తాను సిగరెట్లు తాగనని, తన చుట్టుపక్కల ఎవరైనా..సిగరెట్ తాగి..తనకు నచ్చదని వెల్లడించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఆరు భాషలు వచ్చని తెలిపారు.