Heroins : పెళ్ళైనా సినిమాలు చేస్తాం.. పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా హీరోయిన్స్..
ఒకప్పుడు పెళ్లైతే అక్క, వదిన, తల్లి క్యారెక్టర్లు మాత్రమే చేసి లేని పెద్దరికాన్ని నెత్తిన వేసుకున్న హీరోయిన్లు, ఇప్పుడు సారీ బాస్ మాకింకా అంత వయసు రాలేదు, మేం అలాంటి క్యారెక్టర్లు చెయ్యం.................

Heroins : సినిమా ఇండస్ట్రీలో రూల్ మారుతోంది, రూలింగ్ మారుతోంది. హీరో సెంట్రిక్ సినిమాగా ఉన్న ఒకప్పటి ఇండస్ట్రీని ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆక్యుపై చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లైతే అక్క, వదిన, తల్లి క్యారెక్టర్లు మాత్రమే చేసి లేని పెద్దరికాన్ని నెత్తిన వేసుకున్న హీరోయిన్లు, ఇప్పుడు సారీ బాస్ మాకింకా అంత వయసు రాలేదు, మేం అలాంటి క్యారెక్టర్లు చెయ్యం అంటున్నారు. అంతేకాదు పెళ్లై సంవత్సరాలైనా హాట్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతూ పెళ్లైతే ఏంటి..? అంటూ కెరీర్ ని కూల్ గా కంటిన్యూ చేస్తున్నారు.
పెళ్లై పిల్లలు పుట్టి మనవళ్లతో ఆడుకుంటూ 60 ఏళ్లు దాటినా మన హీరోలు మాత్రం ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ, కూల్ డూడ్స్ గా కటింగులు కొట్టొచ్చు. కానీ హీరోయిన్లు మాత్రం పాతికేళ్లకే పెళ్లి చేసుకున్నా చెల్లి గానో, తల్లిగానో క్యారెక్టర్లు చేసేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారింది, సినిమా మారింది. ఒకప్పుడు కెరీర్ ఎక్కడ ఉండదో అని పెళ్లి చేసుకుని కూడా ఆ విషయాన్ని దాచి పెట్టిన హీరోయిన్లు ఇప్పుడు పెళ్లైనా కూడా చాలా కాన్ఫిడెంట్ గా కెమెరా ముందుకొస్తున్నారు, హీరోయిన్ గా తమ కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు.
భాగ్యశ్రీ, అసిన్, కాజల్, సోనాలి బేంద్రే, జ్యోతిక, షాలిని లాంటి హీరోయిన్లు కెరీర్ పీక్ టైమ్ లోనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో బిజీ అయిపోయారు. మరి కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసినా అంతకుముందు లా టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని కూడా టాప్ హీరోయిన్లుగా కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా పెళ్లి చేసుకుని హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు చాలా మంది హీరోయిన్లు.
విఘ్నేష్ ని పెళ్లి చేసుకుని పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే అప్పుడే షూటింగ్, సినిమాల గురించి ప్లాన్ చేసుకుంటోంది నయనతార. సౌత్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సోలోగా ప్రూవ్ చేసుకుంటోంది. 20 ఏళ్ల నుంచి హీరోయిన్ గా చేస్తున్న నయనతార సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా కంటిన్యూ అవుతోంది. తమిళ్, తెలుగు మళయాళంతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లో కూడాఎంట్రీ ఇస్తోంది. పెళ్లి చేసుకుని 10 రోజులైనా షారూఖ్ ఖాన్ తో, అట్లీ సినిమా షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా, గోల్డ్ మూవీతో పాటు కనెక్ట్ అనే మరో సినిమా చేస్తోంది నయనతార.
పెళ్లి తర్వత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ఒక్కసారిగా చెలరేగిపోతుంది సమంత. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది సమంత. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ వైజ్ టాప్ రేంజ్ లోఉన్న సమంత తనకంటూ సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, విమెన్ సెంట్రిక్ మూవీస్ నుంచి వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ వరకూ ఇలా తన మార్కెట్ ని రోజురోజుకీ పెంచుకుంటోంది సమంత. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో పాటు సమంత సినిమాలు కూడా ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. గుణశేఖర్ శాకుంతలం, యశోదతో పాటు అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ సినిమా కూడా చేస్తూ క్రేజీ సినిమాలతో ఇంకా బిజీ అయ్యింది సమంత.
సౌత్ లో పెళ్లి చేసుకున్నా ఇంకా అదే క్రేజ్ తో హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న మళయాళ కుట్టి నజ్రియా. ముస్లిమ్ కమ్యూనిటీ అయినా పెద్దగా ఎక్స్ పోజర్ లేని మళయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ఇంకా హీరోయిన్ గా హాట్ ఆఫర్స్ తో టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతోంది నజ్రియా. పెళ్లయ్యాక కన్జర్వేటివ్ సినిమాలు కాకుండా ట్రాన్స్ లాంటి ఎక్స్ పెరిమెంటల్ తో పాటు.. లేటెస్ట్ గా తెలుగులో అంటే సుందరానికి లాంటి క్యూట్ లవ్ స్టోరీతో ఆడియన్స్ లో తన క్రేజ్ ని ఇంకా పెంచేసుకుంది నజ్రియా.
రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ కూడా ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా సూపర్ స్పీడ్ గా సినిమాలు చేస్తోంది. పెళ్లి హడావిడి అయిపోయాక పెద్దగా టైమ్ తీసుకోకుండానే షూటింగ్ కి అటెండ్ అయ్యింది ఆలియా. పెళ్లైన హీరోయిన్ అంటే జాతికి సందేశాలిచ్చే సినిమాల్లో కాకుండా, భయపెట్టి, బెదిరించే విమెన్ సెంట్రిక్ సినిమాల్లోనే కాకుండా క్యూట్ లవ్ స్టోరీస్ కూడా చేస్తోంది ఆలియా. ఈ సంవత్సరం రిలీజ్ అయిన గంగూభాయ్ తో 100 కోట్ల హీరోయిన్ గా తన స్టామినా చూపించింది ఆలియా. పెళ్లయ్యింది కదా అని సినిమాలను పక్కన పెట్టకుండా పెళ్లికి ముందు ఎలాంటి స్పీడ్ తో సినిమాలు చేసిందో, పెళ్లి తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఆలియా భట్. ప్రస్తుతం ఆలియా బ్రహ్మస్త్ర, రాకీ ఓర్ రానీ కీ ప్రేమ్ కహానీ, డార్లింగ్స్ సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రణవీర్ సింగ్ ని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి తరువాత కూడా ఈమె క్రేజు ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి చేసుకన్నా కానీ కెరీర్ ని ఏమాత్రం పక్కకి పెట్టకుండా అదే స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే బాజీరావ్ మస్తానీ, పద్మావత్ తో తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకుంది. అంతేకాకుండా గెహరాయియా లో బోల్డ్ గా నటించింది. ఈ సినిమాపై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా దీపికా ముందుండి సినిమాని సక్సెస్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతున్న హీరోయిన్స్ జాబితా లో దీపికా పదుకొనె టాప్ ప్లేస్ లో ఉంది. పెళ్లయినా కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది దీపిక పదుకొనె. అంతేకాకుండా అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితా లో కూడా దీపికానే ముందుంది. ప్రజెంట్ దీపికా లిస్ట్ లో పఠాన్, ప్రాజెక్ట్ కె, సర్కస్ సినిమాలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ద్రౌపది సినిమాలతో బిజీగా ఉంది.
UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..
పెళ్లయ్యాక భర్త, పిల్లలు, సంసారం అనుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేసింది కత్రినా కైఫ్. విక్కీ కౌషల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ పెళ్లయ్యాక ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా అంతే స్పీడ్ గా షూటింగ్స్ స్టార్ట్ చేసేసింది. ప్రజెంట్ కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ తో సూపర్ హిట్ సిరీస్ టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతి తో మెర్రీ క్రిస్ మస్ అనే ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తోంది.
అసలు పెళ్లయిన తర్వత గ్లామరస్ గా కెరీర్ కంటిన్యూ చెయ్యొచ్చనే ట్రెండ్ ని స్పీడప్ చేసిందే బాలీవుడ్ స్టైల్ దీవా కరీనా కపూర్. సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్నాక కెరీర్ లో ఏమాత్రం మార్పులేకుండా యాజ్ యూజువల్ గా సినిమాలు చేస్తోంది 40 ఏళ్ల కరీనా. పెళ్లయ్యింది కదా అని ఏదో సో కాల్డ్ విమెన్ సెంట్రిక్ సినిమాలు కాకుండా హాట్ హాట్ రొమాన్స్ చేస్తూ, బోల్డ్ రోల్స్ కూడా చేస్తోంది కరీనా. పెళ్లి చేస్కోవడమే కాదు, ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఇంకా అంతే హాట్ గా ఆడియన్స్ ముందుకొస్తోంది కరీనా. అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్న కరీనా కపూర్ మరికొన్ని ఇంట్రస్టింగ్ మూవీస్ కి ప్లాన్ చేస్తోంది.
అందాల భామ ఐశ్వర్యరాయ్ కూడా పెళ్లి చేసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్ లెజెండ్ బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లినా తనకెరీర్ ని మాత్రం అపలేదు ఐశ్వర్య. ఫస్ట్ లో కాస్త డిఫరెంట్ రోల్స్ చేసినా ఆతర్వాత తన కన్నా చిన్నవాళ్లైన హీరోలతో రొమాన్స్ కూడా చేసి పెళ్లైతే బోల్డ్ గా కనిపించకూడదా అంటూ రూల్స్ ని బ్రేక్ చేసి చూపించింది. ఇప్పుడు కూడా రజనీకాంత్, మణిరత్నం సినిమాలతో బిజీగా ఉంది ఐశ్వర్యారాయ్.
Chiranjeevi : సూపర్ స్టార్‌ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. ఆహా నుంచి అదిరిపోయే వీడియో..
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిపోయిన ప్రియాంకా చోప్రా కూడా ఇంకా హాట్ హీరోయిన్ గానే కంటిన్యూ అవుతోంది. ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదుగుతున్నప్పుడే ప్రియాంకా చోప్రా కూడా పెళ్లి చేసుకుంది కానీ ఇంకా హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయినా హాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ గ్లామర్ గా కూడా కంటిన్యూ అవుతోంది. మొన్నీమధ్యే మ్యాట్రిక్స్ మూవీ రిలీజ్ చేసిన ప్రియాంకా బాలీవుడ్ లో డార్లింగ్స్ మూవీ చేస్తోంది.
కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి తన రూటే సెపరేట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ పెళ్లయిన తర్వత కూడా అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తోంది. కెరీర్ లో బిజీగా ఉండి పెళ్ళవ్వక ముందు ఉన్న ఫాన్ బేస్ ని పెళ్లయిన తర్వత కూడా కొనసాగిస్తోంది విద్యాబాలన్. మిషన్ మంగల్, షేర్నీ, శకుంతలా దేవి లాంటి విమెన్ సెంట్రిక్, ఇంట్రస్టింగ్ మూవీ స్ చేస్తున్నా కూడా తన ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తోంది విద్యాబాలన్.
అనుష్క శర్మ, యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉండే ఈ హీరోయిన్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విరాట్ కోహ్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కూడా క్రేజీ సినిమాలతో పాటు చక్ దా ఎక్స్ ప్రెస్ లాంటి విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది.
హీరోయిన్లుగా బిజీ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్లయ్యి కూడా కెరీర్ కంటిన్యూ చేస్తున్నమరో ఇద్దరు హీరోయిన్లు యామి గౌతమ్, మౌని రాయ్. చేసింది తక్కువ సినిమాలైనా, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ చేసిన యామీ గౌతమ్, మౌని రాయ్ లాంటి హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని గ్లామర్ రోల్స్ చేస్తూ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా పెళ్లి హీరోయిన్లుగా తమ కెరీర్ కి ఏమాత్రం అడ్డం కాదని, గ్లామరస్ గానే సినిమాలు చేస్తూ కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటి హీరోయిన్లు.
- Deepika Padukone: దీపికా ఆరోగ్యంపై అశ్వినీ దత్ క్లారిటీ..ఏమన్నారంటే?
- Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్..
- Nayan-Vignesh : నయనతార-విగ్నేష్ శివన్ రిసెప్షన్ ఫోటోలు
- Nayan-Vignesh : నయన్ పెళ్ళికి షారుఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
- Nayan-Vignesh : నయన్-విగ్నేష్ ఎంత గొప్ప మనసో.. పెళ్ళికి లక్షమంది ఆనాధలు, వృద్ధులు, పేదలకు భోజనాలు..
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
2IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
3World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
4GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
5Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
6Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
7Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
9Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
10Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!