HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2

యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు మంచి మార్కులు వేయగా, సినీ క్రిటిక్స్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2

HIT 2: యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు మంచి మార్కులు వేయగా, సినీ క్రిటిక్స్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

HIT 2: హిట్-2 హిందీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చడంతో ఈ మూవీ తొలిరోజే మంచి వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.11.27 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. హీరో అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

HIT 2: హిట్-2 విషయంలో మేకర్స్ ఆ తప్పు చేశారా..?

హిట్-2 సినిమాకు ఇంత మంచి ఆదరణ అందిస్తూ, ఈ సినిమాను నిజమైన హిట్ చేసిన ప్రేక్షకులకు నిర్మాత నేచురల్ స్టార్ నాని థ్యాంక్స్ చెబుతున్నారు. ఇక హిట్ వర్స్‌లో రాబోయే నెక్ట్స్ మూవీలో హీరోగా నాని నటించబోతున్నట్లు హిట్-2 సినిమాలో చూపెట్టడంతో ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. మరి హిట్-2 సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.