Hit 2 Teaser : హిట్ సెకండ్ కేస్ టీజర్ రిలీజ్.. అడివిశేష్ మేనియా.. నాని, శేష్‌కి ఇంకో హిట్ రెడీ..

ఇప్పటికే హిట్ సెకండ్ కేస్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు చిత్ర యూనిట్. తాజగా హిట్ సెకండ్ కేస్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో అడవి శేష్.........................

Hit 2 Teaser : హిట్ సెకండ్ కేస్ టీజర్ రిలీజ్.. అడివిశేష్ మేనియా.. నాని, శేష్‌కి ఇంకో హిట్ రెడీ..

Hit 2 movie Promo released

Hit 2 Promo :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే చెప్పారు చిత్ర యూనిట్. హిట్ సెకండ్ కేస్ లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే హిట్ సెకండ్ కేస్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు చిత్ర యూనిట్. తాజగా హిట్ సెకండ్ కేస్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో అడవి శేష్ క్యారెక్టర్ గురించే ఎక్కువగా చూపించారు. కేసు మొదలు పెట్టకు ముందు అడివి శేష్ ఇంట్రో, అడివి శేష్ ఎలా ఉంటాడో చూపించారు. ఒక అమ్మాయి మర్డర్ తో సెకండ్ కేస్ మొదలవుతుంది అని చెప్పారు కానీ ఎలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు టీజర్ లో చూపించలేదు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెప్తున్న దాని బట్టి, టీజర్ లో కూడా ఏమి చూపించకుండా సినిమాలోనే చూసుకొని అన్నట్టు లీడ్ ఇచ్చి వదిలేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Devisri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కరాటే కళ్యాణి పోలీసులకి ఫిర్యాదు.. దేవిశ్రీ ప్రసాద్‌ ఆఫీస్‌ని ముట్టడిస్తాం అంటూ హెచ్చరిక..

కచ్చితంగా హిట్ సెకండ్ కేస్ సినిమా ఫుల్ సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు నానికి, అడివి శేష్ కి ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.