Hit -2 : ‘బాలయ్య, మోక్షజ్ఞ’లతో హిట్ టీమ్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!

అడివి శేషు హిట్-2 సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణ, అయన తనయుడు మోక్షజ్ఞ ఇవాళ వీక్షించారు. ఈ విషయాన్ని అడివి శేషు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Hit -2 : ‘బాలయ్య, మోక్షజ్ఞ’లతో హిట్ టీమ్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!

Hit movie team selfie with Balayya, Mokshagna

Hit -2 : అడివి శేషు హిట్-2 సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. హిట్ యూనివర్సల్ సెకండ్ కేసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా హిట్-1 అందర్నీ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మించాడు.

HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2

కాగా ఈ సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణ, అయన తనయుడు మోక్షజ్ఞ ఇవాళ వీక్షించారు. ఈ విషయాన్ని అడివి శేషు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “బాలకృష్ణ గారికి మరియు మోక్షజ్ఞకు హిట్-2 సినిమా చాలా బాగా నచ్చింది. ఇక నా యాక్టింగ్, శైలేష్ కొలను దర్శకత్వానికి బాలకృష్ణ గారు ఇచ్చిన కంప్లిమెంట్స్ మర్చిపోలేనివి” అంటూ తెలియజేశాడు.

అంతేకాదు హిట్ యూనివర్స్ బాలయ్యని కూడా భాగం కావాలని అడివి శేషు కోరగా.. బాలకృష్ణ నవ్వుతో సమాధానం చెప్పినట్లు తెలియజేశాడు. సినిమా చూసిన తరువాత బాలయ్య, మోక్షజ్ఞ మూవీ టీమ్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం కూడా ఉండబోతున్నట్లు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణ తెలియజేసిన సంగతి తెలిసిందే.