Jeremy Renner : అమెరికాలో మంచు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్‌కి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

అమెరికాలో తన ఇంటివద్ద భారీ వాహనంతో మంచుని తొలగిస్తున్న క్రమంలో జెరేమి రెన్నర్ కి ప్రమాదం జరిగినట్టు సమాచారం. అక్కడి స్థానికులు గమనించి జెరేమి రెన్నర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం జెరేమి రెన్నర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.................

Jeremy Renner : అమెరికాలో మంచు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్‌కి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

Jeremy Renner :  గత కొన్ని రోజులుగా అమెరికాలో భారీగా మంచు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంచు వల్ల అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది మరణించారు, కొంతమంది అనారోగ్యానికి గురయి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ మంచు వల్ల హాలీవుడ్ స్టార్ యాక్టర జెరేమి రెన్నర్ ప్రమాదానికి గురయ్యారు.

అమెరికాలో తన ఇంటివద్ద భారీ వాహనంతో మంచుని తొలగిస్తున్న క్రమంలో జెరేమి రెన్నర్ కి ప్రమాదం జరిగినట్టు సమాచారం. అక్కడి స్థానికులు గమనించి జెరేమి రెన్నర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం జెరేమి రెన్నర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇంకా అతని కండిషన్ క్రిటికల్ గానే ఉందని అక్కడి వైద్యులు తెలిపారు.

Alia Bhatt : పెళ్లి చేసుకోవడం, తల్లి కావడం నా ఇష్టం.. అలియాభట్ వ్యాఖ్యలు..

జెరేమి రెన్నర్ ఎవెంజర్స్, మిషన్ ఇంపాజిబుల్, కెప్టెన్ అమెరికా సిరీస్ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. జెరేమి రెన్నర్ ప్రమాదానికి గురయి హాస్పిటల్ లో ఉన్నాడు అని తెలియడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ప్రార్థిస్తున్నారు.