Hrithik Roshan: త్వరలో హృతిక్ రెండో పెళ్లి.. సినిమాలకు బ్రేక్?

భార్యతో విడాకుల అనంతరం పిల్లల కోసం స్నేహితులుగా అప్పుడప్పుడూ మాజీ భార్యను కలుస్తున్న బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ఈ మధ్య మళ్ళీ ప్రేమలో పడ్డాడని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే

Hrithik Roshan: త్వరలో హృతిక్ రెండో పెళ్లి.. సినిమాలకు బ్రేక్?

Hrithik Roshan

Hrithik Roshan: భార్యతో విడాకుల అనంతరం పిల్లల కోసం స్నేహితులుగా అప్పుడప్పుడూ మాజీ భార్యను కలుస్తున్న బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ఈ మధ్య మళ్ళీ ప్రేమలో పడ్డాడని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హృతిక్ సభా ఆజాద్ అనే అమ్మాయితో కలిసి ముంబ‌యిలోని ఒక ఫేమ‌స్ జ‌ప‌నీస్ రెస్టారెంట్లో ఆ మధ్య విందుకు హాజరవడంతో మొదలైన ఈ హృతిక్ కొత్త రిలేషన్ వ్యవహారం ప్రస్తుతం దేశమంతా వ్యాపించేసింది.

Hrithik Roshan: హృతిక్ ఇంట్లో కొత్త గర్ల్‌ఫ్రెండ్.. ఫ్యామిలీతో స్పెషల్ సన్‌డే!

ఇక అదే అమ్మాయిని ఈ మధ్యనే ఓ ఆదివారం నేరుగా హృతిక్ ఇంటికే తీసుకెళ్లాడు. హృతిక్ ఫ్యామిలీతో కలిసి లంచ్.. ఫ్యామిలీతో సభా గడిపిన తీరును సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. అంతేకాదు.. సభా సోషల్ మీడియా పోస్టులకు హృతిక్ రియాక్షన్, ఎమోజీలు.. పొగడ్తలు ఇలా అబ్బో వ్యవహారం చాలా దూరమే నడిచిందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే.. దీనిపై హృతిక్ ఇంతవరకు ఔను.. కాదు అని స్పందించనేలేదు. కానీ.. త్వరలోనే హృతిక్ మరోసారి పెళ్లి కొడుకు అయ్యేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది.

Hrithik Roshan: కొత్త భామతో హృతిక్.. మళ్ళీ ప్రేమలో పడ్డాడా?

ఓపెన్ గానే చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుండగా.. హృతిక్ కుటుంబ సభ్యులు కూడా సబాతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి గురించి ప్రకటన రావడమో లేక సైలెంటుగా పెళ్లి జరిపించేయడమో జరగొచ్చంటున్నారు. ఇందుకోసం కొన్ని రోజులు హృతిక్ సినిమాలకు కూడా దూరం కాబోతున్నాడని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో.. ఇప్పుడిప్పుడే పెళ్లి అడుగులు వేస్తారా లేక మరికొన్నాళ్లు ఇలా ఫజిల్ మాదిరే ఉండిపోతారా అన్నది చూడాలి.