Hrithik-Ranbir : బాలీవుడ్ బిగ్ క్లాష్..

హృతిక్ రోషన్ - రణ్‌బీర్ కపూర్‌ల మధ్య బాక్సాఫీస్ బరిలో బిగ్ ఫైట్..

Hrithik-Ranbir : బాలీవుడ్ బిగ్ క్లాష్..

Hrithik Roshan Ranbir Kapoor

Hrithik-Ranbir: పాండమిక్ తర్వాత సినిమా రంగం కాస్త ఊపిరి పీల్చుకుంది. టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలో షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. థియేటర్లు తెరుచుకోవడంతో రిలీజులు, మెల్లగా 100 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. రిలీజ్ పెండింగ్ ఉన్న సినిమాలు.. కొత్తగా షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న మూవీస్‌తో రిలీజ్ క్లాషెస్ తప్పేలా లేవు.

Balayya – Mahesh : బాలయ్య – మహేష్ మల్టీస్టారర్..

మనదగ్గర 2022 సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పేలా లేదు. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, 12 ‘భీమ్లా నాయక్’, 14 ‘రాధే శ్యామ్’, 15 ‘బంగార్రాజు’ సినిమాలు షెడ్యూల్ చేసుకున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. మిగతా సినిమాలు లాస్ట్ మినిట్‌లో డేట్ ఛేంజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Jr NTR : ఈ స్టిల్ ఏ సినిమాలోదో తెలుసా!

బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైలెట్ ఏంటంటే ఈ ఏడాది క్రిస్మస్‌లో, అలాగే వచ్చే ఏడాదిలో రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు ఇప్పటికే డేట్స్ లాక్ చేసేసుకున్నాయి. కట్ చేస్తే 2023లో కూడా ఈ ప్రాబ్లమ్ తప్పేలా లేదు. మరో బాలీవుడ్ బాక్సాఫీస్ క్లాష్ జరుగబోతోందనే వార్త ఇప్పుడు హిందీ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతోంది.

Nataraj Master : మళ్లీ తండ్రైన నటరాజ్ మాస్టర్..

హృతిక్ రోషన్, దీపిక పదుకొణే జంటగా.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఫైటర్’ మూవీని 2023 జనవరి 26న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. రణ్‌బీర్ కపూర్ – శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా.. ‘ప్యార్ కా పంచ్‌నామా’ సిరీస్‌తో పాటు ‘సోను కె టిటు కీ స్వీటీ’ సినిమాతో ఆకట్టుకున్న లవ్ రంజన్ తెరెక్కిస్తున్న మూవీని కూడా 2023 రిపబ్లిక్ డే నాడు విడుదల చెయ్యాలనుకున్నారు. సో ఈ రెండు సినిమాలతో 2023 జనవరి 26న బిగ్ క్లాష్ తప్పేలా లేదన్నమాట.