Tollywood Heroes : క్రాస్ రోడ్స్‌లో కుమ్మిపడేశారు.. ఎవరివి ఎన్ని సినిమాలో తెలుసా? | Tollywood Heroes

Tollywood Heroes : క్రాస్ రోడ్స్‌లో కుమ్మిపడేశారు.. ఎవరివి ఎన్ని సినిమాలో తెలుసా?

సరైన సాలిడ్ సినిమా పడాలే కానీ మన టాలీవుడ్ హీరోల్లో ఎవరూ తక్కువ కాదు..

Tollywood Heroes : క్రాస్ రోడ్స్‌లో కుమ్మిపడేశారు.. ఎవరివి ఎన్ని సినిమాలో తెలుసా?

Tollywood Heroes: సరైన సాలిడ్ సినిమా పడాలే కానీ మన టాలీవుడ్ హీరోల్లో ఎవరూ తక్కువ కాదు. యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తూ సీనియర్ హీరోలు కూడా సత్తా చాటుతున్నారు. బాలయ్య రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు.

Akhanda : 20 ఏళ్ల తర్వాత క్రాస్ రోడ్స్‌లో కోటి కొల్లగొట్టిన బాలయ్య!

ఈ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించి, కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టడమే కాక.. దాదాపు కనుమరుగైపోయిన 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య. అలాగే 20 సంవత్సరాల తర్వాత (2001-నరసింహ నాయుడు) హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ‘అఖండ’..

Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..

ఈ సందర్భంగా మన టాలీవుడ్ హీరోల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాలు ఎవరివి ఎన్ని ఉన్నాయో చూద్దాం.. చిరంజీవి 5, బాలకృష్ణ 2, మహేష్ బాబు 9, ప్రభాస్ 5, పవన్ కళ్యాణ్ 4, అల్లు అర్జున్ 6, ఎన్టీఆర్ 2, రామ్ చరణ్ 2.. ఏకంగా తొమ్మిది సినిమాలతో సూపర్‌స్టార్ మహేష్ బాబు అందరికంటే టాప్‌లో ఉన్నాడు.

Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..

ఆరు సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 5 సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ థర్డ్ పొజిషన్‌లో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు కూడా కోటి రూపాయల మార్క్ టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.

Radhe Shyam : మార్చి 18న ‘రాధే శ్యామ్’?

×