Indian 2: సౌతాఫ్రికా వెళ్తున్న ఇండియన్.. ట్రైన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన శంకర్!
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘ఇండియన్-2’ ఇప్పటికే దేశవ్యాప్తంగా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరోసారి తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న భారతీయుడు గెటప్‌లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు కమల్ రెడీ అవుతున్నాడు.

Indian 2: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘ఇండియన్-2’ ఇప్పటికే దేశవ్యాప్తంగా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరోసారి తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న భారతీయుడు గెటప్‌లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు కమల్ రెడీ అవుతున్నాడు.
Indian 2 : హెలికాప్టర్‌ని షేర్ ఆటోలా వాడుతున్న లోకనాయకుడు..
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి ఓ అప్డేట్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను సౌత్ ఆఫ్రికాలో చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ట్రైన్‌లో చిత్రీకరించేందుకు దర్శకుడు శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కమల్‌తో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.
Indian 2 : సౌత్ ఆఫ్రికాకు పయనమైన లోకనాయకుడు.. ఇండియన్ 2 షెడ్యూల్..
ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు అందాల భామ కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి సౌత్ ఆఫ్రికాలో షూట్ చేయబోతున్న ఈ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇండియన్-2 మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.