Pawan Kalyan: పవన్-సుజిత్ సినిమాలో అవేమీ ఉండవా.. అభిమానులు ఒప్పుకుంటారా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేసి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశారు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన పవన్, ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేసి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశారు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన పవన్, ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్‌గా పవన్ మరో ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది.
Pawan Kalyan warn To YCP : ఆంధ్రప్రదేశ్‌ను విడగొడతాం అంటే తోలు తీస్తాం : పవన్ కల్యాణ్
ఈ సినిమాలో ఎలాంటి సాంగ్స్, ఫైట్స్ ఉండబోవని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సుజిత్ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడని.. అందుకే ఈ సినిమాలో ఎలాంటి పాటలు, ఫైట్లు లేకుండా తీసుకురాబోతున్నాడట. మరి నిజంగానే పవన్ సినిమాలో పాటలు, ఫైట్లు లేకుండా వస్తే, ఈ సినిమాను అభిమానులు ఆదరిస్తారా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.