Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

మన తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారుతూ నేషనల్ వైడ్ స్టార్ డమ్ సంపాదించుకొనే పనిలో ఉంటే పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

Dhanush Sir

Dhanush SIR: మన తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారుతూ నేషనల్ వైడ్ స్టార్ డమ్ సంపాదించుకొనే పనిలో ఉంటే పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో తమిళ స్టార్ హీరోలు విజయ్, ధనుష్ ముందున్నారు. విజయ్ ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా వెర్సటైల్ యాక్టర్ గా పేరున్న ధనుష్ చాలా కాలంగా డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓ సినిమా ఖరారైంది.

Radhe Shyam: రూట్ మార్చేశారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరో హోస్టింగ్!

తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి తన నాలుగో సినిమాగా ధనుష్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ను అందించబోతున్నాడు. ఆ సినిమా టైటిల్ కూడా సార్ అని పెట్టడంతో ఆసక్తికరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం.

Unstoppable with NBK: బాలయ్య టాక్ షో.. మహేష్‌తో లాస్ట్ ఎపిసోడ్

నిజానికి ధనుష్ రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలకు ఒకే చెప్పాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి మూవీ కాగా.. మరొకటి శేఖర్ కమ్ముల సినిమా. శేఖర్ కమ్ముల సినిమానే ముందు ఒప్పుకున్నా వెంకీ అట్లూరి సినిమానే ముందు ప్రారంభం కానుంది. శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లేకి సమయం పడుతుండగా వెంకీ ఇప్పటికే స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేసి ఉంచడం.. సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు, చేర్పులతో స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ముందే పట్టాలెక్కింది.

Republic 2: పవర్ స్టార్ హీరోగా మేనల్లుడి సినిమాకు సీక్వెల్?

ఇక, ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించడం మరో విశేషం. భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్తనే ఈ సినిమా కోసం ఫైనల్ చేశారు. భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మించడం.. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే అందించే త్రివిక్రమ్ ఈ సినిమాకు సహా నిర్మాతగా మారడం.. హీరోయిన్ ను ఆ సినిమాలో నటించిన సంయుక్తనే తీసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా.. సార్ సినిమా కథ కూడా యూనివర్సల్ సబ్జెక్టుతో బలమైన కథగా తెలుస్తుంది.