Bandi Sanjay: రాజకీయాలకు దూరంగా బండి సంజయ్? ఇలా ఎంతకాలం.. రీజన్ ఏంటి?

బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేటీఆర్ వాడుతున్నాడని సెన్సేషనల్‌ అలిగేషన్స్ చేసిన బండి ఆ తర్వాత నో కామెంట్‌ అంటూ సైలెంట్ అయిపోయారు.

Bandi Sanjay: రాజకీయాలకు దూరంగా బండి సంజయ్? ఇలా ఎంతకాలం.. రీజన్ ఏంటి?

Updated On : September 23, 2025 / 10:28 PM IST

Bandi Sanjay: ఆయన స్పైసీ కామెంట్స్‌కు కేరాఫ్. సైలెంట్‌గా ఉంటారు. సడెన్‌గా ఏదో ఒక ఇష్యూను లేవనెత్తి లైమ్‌లైట్‌లోకి వచ్చేస్తారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీ లీడర్లను ఇరకాటంలో పెట్టడంలో ముందుంటారు. పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్లు ఎలా ఉండేవో తెలియంది కాదు. లేటెస్ట్‌గా బీఆర్ఎస్ లీడర్లు.. లగ్జరీ కార్లు అంటూ బ్లాస్టింగ్ కామెంట్స్ చేసి చర్చకు దారి తీసిన బండి..ఆ తర్వాత ఆల్‌ ఆఫ్ సడెన్‌గా సైలెంట్ అయిపోయారు. ఇక నో పాలిటిక్స్‌ ఓన్లీ డివోషనల్ అంటున్నారట. బండి పొలిటికల్ బ్రేక్ ఎందుకు? ఆయన నోటి నుంచి మళ్లీ మాస్ మసాల కామెంట్స్ ఎప్పుడు?

రాజకీయాలకు ఎంతకాలం దూరంగా ఉంటారో?

బండి సంజయ్. ఆయన ఏ పదవిలో ఉన్నా.. ఫైర్ బ్రాండ్‌ లీడర్‌గా..ఆయన ఏది మాట్లాడినా సెన్సేషనే. ఆయన ఒక్క స్టేట్‌ మెంట్‌ ఇస్తే చాలు రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ ఇష్యూ చుట్టూ తిరగాల్సిందే. కార్యక్రమం ఏదైనా..ఇష్యూ ఇంకేదైనా బండి చేసే కామెంట్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. పాలిటిక్స్‌కు సంబంధం లేని కార్యక్రమాల్లో పాల్గొన్నా దానిని అటు తిప్పి ఇటు తిప్పి రాజకీయాలకు ముడి పెట్టడం బండి స్పెషాలిటీ. హిందుత్వానికి లింక్ చేసి రాజకీయాలను రక్తి కట్టిస్తారు బండి సంజయ్. అటువంటి బండి సంజయ్ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారట. అవును పాలిటిక్స్‌కు చిన్న బ్రేక్ ఇవ్వనున్నారట. అయితే ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఎంతకాలం దూరంగా ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

కేటీఆర్ పై సంచలన ఆరోపణలు..

ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా బండి సంజయ్ కరీంనగర్‌లో మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారి దీక్ష తీసుకున్నారు. ఈ దీక్ష తీసుకునే ముందు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేటీఆర్ వాడుతున్నాడని సెన్సేషనల్‌ అలిగేషన్స్ చేసిన బండి ఆ తర్వాత నో కామెంట్‌ అంటూ సైలెంట్ అయిపోయారు. పొలిటికల్ బ్రేక్‌కు ముందు ఆయన ఇచ్చిన లాస్ట్ పొలిటికల్ స్టేట్ మెంట్ ఇదే. దీని తర్వాత ఆయన నవరాత్రి ముగిసే వరకు రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా శరన్నవరాత్రులు జరిగే తొమ్మిది రోజుల పాటు ఆయన ఎలాంటి రాజకీయాలు మాట్లాడరని సన్నిహితులు చెబుతున్నారు.

అయితే అమ్మవారి దీక్ష తీసుకునే ముందు రాజకీయ ఆరోపణలు చేసిన బండి సంజయ్..ఇక నైన్ డేస్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటారట. ఆయనపై ఎవరైన ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేసినా స్పందించరట. పూర్తిగా ఈ 9 రోజులు ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ అమ్మవారికి సేవ చేస్తూ దాండియా, బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొంటారట. అంతే కాకుండా పార్టీ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా ఆయన ఆ దేవాలయాన్ని విడిచి 9రోజులు బయటకు రాకుండా అక్కడే ఉంటారట.

నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉండే సంజయ్ తొమ్మిదిరోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండటం కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే. అమ్మవారి భక్తుడైన బండి సంజయ్ ప్రతీ ఏడాది తొమ్మిదిరోజులు మాలలో ఉంటారు. కరీంనగర్‌కే పరిమితం అవుతారు. ఆ టైమ్‌లో నో పాలిటిక్స్ నో కామెంట్స్‌ అంటూ సాధ్యమైనంత వరకు మీడియా కంటపడకుండా..అమ్మవారి సన్నిధిలో పూర్తిగా దైవారాధానలో ఉంటారు. స్పైసీ అండ్ కాంట్రవర్సీ కామెంట్స్‌కు కేరాఫ్‌గా ఉండే సంజయ్‌ అమ్మవారి దీక్షతో పాలిటిక్స్‌ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకోవడం అయితే అందరి అటెన్షన్‌ను గ్రాబ్‌ చేస్తోంది. దీక్ష అయిపోయిన తర్వాత బండి ఏ అంశంతో మళ్లీ మీడియాలో హాట్ టాపిక్‌ నిలుస్తారో చూడాలి.

Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్..! బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?