Project K : ప్రాజెక్ట్-K లో దుల్కర్ సల్మాన్.. నిజమేనా?

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటున్నాయి. ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్-K'. ఈ మూవీలో బాలీవుడ్ బడా స్టార్స్.. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని నటిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ బడా ప్రాజెక్ట్ లో..

Project K : ప్రాజెక్ట్-K లో దుల్కర్ సల్మాన్.. నిజమేనా?

Project K

Project K : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బడా స్టార్స్.. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని నటిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ బడా ప్రాజెక్ట్ లో మరో బడా స్టార్ భాగం కాబోతున్నాడట. సీతారామం సినిమాతో తెలుగు వారికీ దగ్గరైన దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో నటించబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్!

మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో వరుసగా వైజయంతి మూవీస్ నిర్మాణంలో నటించిన దుల్కర్.. ఇప్పుడు అదే నిర్మాణంలో వస్తున్న ప్రాజెక్ట్-K లో ఒక చిన్న పాత్ర చేయడానికి ఓకే చెప్పాడట. పాత్ర చిన్నదే అయిన సినిమాని మలుపు తిప్పేలా ఉంటుంది అని సమాచారం. అయితే నిజంగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడా? లేదా? అనేది మాత్రం తెలియదు. కాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని ఫ్యూచరిస్టిక్ సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంతో ఉండబోతుంది. దీంతో ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వెహికల్స్, కాస్ట్యూమ్స్ అన్ని కొత్తగా డిజైన్ చేయిస్తున్నాడు దర్శకుడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక భారీ టైర్ ని తయారు చేస్తున్న వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.