కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల టాస్క్.. ఉన్న పదవి ఊస్ట్ కావొద్దన్నా.. పదోన్నతి రావాలన్నా..

మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తున్నారట.

కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల టాస్క్.. ఉన్న పదవి ఊస్ట్ కావొద్దన్నా.. పదోన్నతి రావాలన్నా..

Revanth Reddy

Updated On : December 8, 2025 / 8:50 PM IST

Congress: పార్టీ గుర్తుతో సంబంధం లేని ఎన్నిక. అలా అని పార్టీలకు సంబంధం లేకుండా మాత్రం ఏ ఎన్నికలు ఉండవు. ఏదో ఒక పార్టీ మద్దతుతోనే ఎక్కువమంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలుస్తారు. పైగా పంచాయతీ ఎన్నికలు అంటే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండటం కూడా కామన్. అయితే ఈక్వేషన్స్ అన్నీ తమకు అనుకూలంగా ఉన్నా..సర్పంచ్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.

సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయడమే కాకుండా..నియోజకవర్గ ఇంచార్జ్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు బిగ్ టాస్క్ ఇచ్చారట. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకుని వచ్చేవారికే భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారట. పంచాయతీ పోరులో సరైన పనితీరు ప్రదర్శించకపోతే..ఉన్న పదవులు ఊస్ట్ అయినా దిక్కు లేదని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారట. దీంతో సర్పంచ్ ఎన్నికల టాస్క్లో మెరిట్ సాధించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారటలీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉండటంతో నేతలు పూర్తిగా నియోజకవర్గాల్లోనే మకాం వేస్తున్నారట.

Also Read: మేయర్ పీఠంపై సస్పెన్స్.. కడపలో పవర్ గేమ్‌..! వైసీపీలోనే తీవ్ర పోటీ..!

పంచాయతీ ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టం చేశారట. ఈ విషయంలో పీసీసీ చీఫ్తో పాటు క్యాబినెట్ మంత్రులను పిలుచుకొని దిశానిర్దేశం చేశారట. అంతేకాదు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్వయంగా సీఎం కూడా ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా ప్రజా పాలన సంబరాలు అంటూ..జిల్లాల టూర్లు తెస్తూ సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అయితే ముఖ్యమంత్రే సీరియస్ మోడ్ లో పనిచేస్తుండటంతో పాటు..అందరికీ స్పెషల్ టాస్క్లు అప్పగించడంతో నేతలు కూడా ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్లు పూర్తిగా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. త్వరలో క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో ఈ ఎన్నికలను తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని చూస్తున్నారట. మంత్రులుగా ఉన్నవారు తమ పదవులను కంటిన్యూ చేసుకోవడానికి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.

ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక
మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తున్నారట. సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్తో సంబంధం లేకపోయినా..ఏ పార్టీ నేతలు బరిలో ఉన్నారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. పైగా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు అంటూ..ఎక్కడికక్కడ మండలాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇంటలిజెన్స్ ద్వారా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వారు గెలిచారనే ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. ఇవన్నీ తమ పనితీరును స్పష్టం చేస్తాయనే..హస్తం లీడర్లు పంచాయతీ పోరును చాలా సీరియస్‌గా తీసుకున్నారని అంటున్నారు.

పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం లేకపోలేదనే చెబుతున్నారు. వచ్చే జనరల్ ఎలక్షన్స్ను సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే గ్రామాల్లో పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని భావిస్తున్నారట. అంతేకాదు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఊర్లల్లో ఉండే నేతలే అంత్యంత కీలకం.

గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట సీఎం. అందుకే సర్పంచ్ ఎలక్షన్స్పై ముఖ్యమంత్రితో సహా హస్తం లీడర్లు అందరూ సీరియస్గా తీసుకున్నారట. పంచాయతీ ఎన్నికల ఫర్పామెన్స్లో ఎవరు సత్తా చాటుతారో.? క్యాబినెట్ బెర్త్ కోసం ఎదురు చూస్తున్న నేతలకు పంచాయతీ గెలుపు ఎంతవరకు కలిసి వస్తుందో.? చూడాలి మరి.