Jr NTR-Balakrishna: బాబాయ్-అబ్బాయ్ మధ్య సినీ వార్ తప్పదా?

సినీ ఇండస్ట్రీలో ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదల అవడం సాధారణ విషయమే. బడా బడా స్టార్స్ సైతం ఇలాంటి పోటీని ఎదుర్కొనగా పండగలు, వరస సెలవుల సమయంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా నెలకొంటుంది.

Jr NTR-Balakrishna: బాబాయ్-అబ్బాయ్ మధ్య సినీ వార్ తప్పదా?

Jr Ntr Balakrishna

Jr NTR-Balakrishna: సినీ ఇండస్ట్రీలో ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదల అవడం సాధారణ విషయమే. బడా బడా స్టార్స్ సైతం ఇలాంటి పోటీని ఎదుర్కొనగా పండగలు, వరస సెలవుల సమయంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా నెలకొంటుంది. కానీ, ఇప్పుడు కరోనా ప్రభావంతో చాలా కాలంగా సినిమాల విడుదల లేకపోగా.. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి దాదాపుగా అరడజను సినిమాల విడుదలకు సిద్దమైన టాలీవుడ్.. రాబోయే దసరాని కూడా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ దసరాకి అక్టోబర్ 13న ఇండియా మోస్ట్ వెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రచారం కూడా హోరెత్తిపోతుంది.

ఆర్ఆర్ఆర్ విడుదలతో మిగతా సినిమాలన్నీ ఆ దరిదాపులలో లేకుండా చూసుకుంటున్నారు. అయితే.. బాలయ్య అఖండ కూడా అదే దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన అఖండ టీజర్, బాలయ్య లుక్, బోయపాటి కాంబినేషన్ కలిసి సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.

దీంతో అఖండ దసరా విడుదలకు ముహూర్తం పెట్టేందుకే దర్శక, నిర్మాతలు ఆసక్తిగా ఉన్నట్లుగా వినిపిస్తుంది. అదే జరిగితే అటు అబ్బాయి ఎన్టీఆర్, ఇటు బాబాయ్ బాలయ్య మధ్య సినీ వార్ తప్పదు. అయితే, ఆర్ఆర్ఆర్ ప్రభంజాన్ని అఖండ తట్టుకొని నిలబడగలదా అనేది ఆసక్తిగా మారుతుంది. ఏది ఏమైనా అఖండ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ దీనిపై ఒక క్లారిటీ రాదు.