Suriya : యూనివర్సల్ కాప్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు.. సింగం-4 వస్తుందా?

యూనివర్సల్ కాప్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. తమిళ వెర్సటైల్ యాక్టర్ సూర్య, మాస్ డైరెక్టర్ హరి కలియకలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సిరీస్ 'సింగం'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి, ఈ మూడు సినిమాలు తమిళంలో మరియు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సింగం-4 కోసం రంగం సిద్దమవుతున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Suriya : యూనివర్సల్ కాప్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు.. సింగం-4 వస్తుందా?

Is there going to be Surya Singham 4?

Suriya : యూనివర్సల్ కాప్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. తమిళ వెర్సటైల్ యాక్టర్ సూర్య, మాస్ డైరెక్టర్ హరి కలియకలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘సింగం’. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి, ఈ మూడు సినిమాలు తమిళంలో మరియు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సింగం-4 కోసం రంగం సిద్దమవుతున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Surya-Karthi: తమిళ హీరో సూర్య దీపావళి వేడుకలో.. టాలీవుడ్ హీరో సాంగ్ కి ఫామిలీతో కలిసి స్టెప్పులు వేస్తున్న కార్తీ..

ఇటీవలే దర్శకుడు హరి, సూర్యకి స్టోరీ అవుట్ లైన్ ని వినిపించాడట. సూర్యకి కూడా నచ్చడంతో.. డెవలప్ చేసుకొని రమ్మని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక అప్‌డేట్ రానప్పటికీ, సూర్య అభిమానులు మాత్రం ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సూర్య నుంచి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వచ్చి చాలా కాలం అయ్యింది.

అయితే ఈ ఫ్రాంచైజీలో అనుష్క మళ్లీ నటిస్తుందో లేదో అనేది ఆశక్తిగా మారింది. అలాగే సింగం-3 కి దేవిశ్రీ అందుబాటులో లేకపోవడంతో హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. అభిమానులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. మరి దేవి మళ్ళీ ఈ ఫ్రాంచైజీలోకి రీ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో తన 42వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.