నీ థియేటర్ల నా బొమ్మ – ఇస్మార్ట్ శంకర్ : రీ-రిలీజ్

సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా 'ఇస్మార్ట్ శంకర్'.. మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు..

  • Published By: sekhar ,Published On : September 26, 2019 / 05:25 AM IST
నీ థియేటర్ల నా బొమ్మ – ఇస్మార్ట్ శంకర్ : రీ-రిలీజ్

సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’.. మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు..

ఈ రోజుల్లో ఒక సినిమా నాలుగు వారాలు ఆడితే బ్లాక్ బస్టర్, రెండు వారాలు ఆడితే సూపర్ హిట్.. నెలరోజులు ఆగితే ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమవుతున్నాయి కొత్త సినిమాలు.. అలాంటిది రీ-రిలీజ్ అంటే ఆశ్చర్యమే కదా.. అవును.. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజుల తర్వాత రీ-రిలీజ్ అనే మాట వినబడుతుంది. ఇంతకీ ఏ సినిమా అంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో పాటు, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.

Read Also : ఇస్మార్ట్ శంకర్ : రీ-రిలీజ్ థియేటర్స్ లిస్ట్..

ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుందీ సినిమా.. రీసెంట్‌గా ‘దిమాక్ ఖరాబ్’ ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్   వీడియో సాంగ్స్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’.. మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణాలో సెలెక్టెడ్ థియేటర్స్‌లో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) ‘ఇస్మార్ట్ శంకర్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.