ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ట్రాక్ – వీడియో సాంగ్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 24, 2019 / 10:52 AM IST
ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ట్రాక్ – వీడియో సాంగ్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో పాటు, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుందీ సినిమా.. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మణిశర్మ ట్యూన్‌కి, భాస్కరభట్ల హైదరాబాదీ స్టైల్‌లో లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడాడు.

Read Also : అక్టోబర్ 5న ఊరంతా అనుకుంటున్నారు!

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్‌లో రామ్ స్టెప్స్ ఇరగదీసేశాడు.. సంగీతం : మణిశర్మ, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : జునైద్ సిద్ధికీ, ఆర్ట్ : జానీ షేక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విషు రెడ్డి, నిర్మాణం : పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్..