Jamuna passed away : ఇందిరాగాంధీపై అభిమానంతో..! రాజకీయాల్లోనూ రాణించిన జమున..

జమున సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నారు. జమునకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆమెను పలుసార్లు కలిసి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆ సమయంలో మీరు రాజకీయాల్లోకి రావాలంటూ ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Jamuna passed away : ఇందిరాగాంధీపై అభిమానంతో..! రాజకీయాల్లోనూ రాణించిన జమున..

Jamuna and indira Gandhi

Jamuna passed away : టాలీవుడ్‌లో గత కొంతకాలం నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతకొద్దిరోజుల క్రితమే సీనియర్ నటులు కృష్ణ, కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ, చలపతి రావు లాంటి స్టార్లు, మరికొంతమంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. తాజాగా సీనియర్ నటి జమున (86) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా వయోసంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Jamuna : టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత..

జమున హంపీలో 1936 ఆగస్టు 30న నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించారు. 14ఏళ్ల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేశారు. 1953లో పట్టిల్లు అనే సినిమాలో ఆమె తొలిసారిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 198 సినిమాల్లో జమున నటించారు. అందులో తెలుగులో నటించిన సినిమాలు 145 ఉన్నాయి. అప్పటి దిగ్గజనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ట తదితరులతో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 

జమున సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నారు. జమునకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆమెను పలుసార్లు కలిసి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆ సమయంలో మీరు రాజకీయాల్లోకి రావాలంటూ ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. అయితే, 1991 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీచేయగా ఓటమిపాలయ్యారు. రాష్ట్ర హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగాకూడా జమున పనిచేశారు. రాజమండ్రిలో ఓటమి తరువాత ఆమె రాజకీయాలకు దూరంగాఉంటూ వచ్చారు. కొద్దికాలానికి భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినీ రంగంలోనేకాక రాజకీయ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు జమున. పలు సేవా కార్యక్రమాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందారు.