Jeremy Renner : 30 ఎముకలు విరిగిపోయాయి.. అవెంజర్స్ నటుడు ఎమోషనల్ పోస్ట్..

ఇటీవల అవెంజర్స్ నటుడు 'జెరేమీ రెన్నర్‌' యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ప్రమాదంలో రెన్నర్‌ ఛాతికి, కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి. కాగా జెరేమీ హాస్పిటల్ నుంచి డిస్కార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..

Jeremy Renner : 30 ఎముకలు విరిగిపోయాయి.. అవెంజర్స్ నటుడు ఎమోషనల్ పోస్ట్..

Jeremy Renner

Jeremy Renner : హాలీవుడ్ సినిమాల్లో అవెంజర్ చిత్రాలకు ఇండియన్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాలను అందులో నటించిన నటులను మన భారతీయ సినీ ప్రేమికులు ఎంతగానో ఓన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల అవెంజర్స్ నటుడు ‘జెరేమీ రెన్నర్‌’ యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ పాలయ్యాడు. జనవరి 1న తన ఇంటి వద్ద మంచులో ఇరుకున్న బంధువు కారుని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జెరేమీ ప్రమాదానికి గురి అయ్యాడు. ఈ ప్రమాదంలో రెన్నర్‌ ఛాతికి, కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి.

Jeremy Renner : అమెరికాలో మంచు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్‌కి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

దాదాపు ప్రాణాలు అంచుల వరకు వెళ్లిన ఈ నటుడు అభిమానుల ప్రార్ధనలు, ప్రేమతో క్షేమంగా తిరిగి వచ్చాడు. ప్రస్తుతం కోలుకున్న జెరేమీ హాస్పిటల్ నుంచి డిస్కార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫోటో షేర్ చేశాడు. ఈ ఫొటోలో జెరేమీ ఇంటి వద్దే ఫిజియోథెరపీ సెషన్‌కు సంబంధించిన దృశ్యం కనిపిస్తుంది. అలాగే ఈ ఫొటోని ట్యాగ్ చేస్తూ ఒక ఎమోషనల్ కామెంట్ కూడా రాసుకొచ్చాడు.

‘ఈ న్యూ ఇయర్ నా మార్నింగ్ వర్కవుట్‌ లను, రిజల్యూషన్‌ లను అన్నీ మార్చేసింది. ఈ విషాదకర సంఘటన నుంచి నేను, నా కుటుంబ సభ్యులు త్వరగానే బయటపడ్డాము. దాదాపు ఒంటిలో 30కి పైగా ఎముకలు విరిగిపోయాయి. అయినా అభిమానుల దీవెనలు, కుటుంబం మరియు మిత్రుల ప్రేమతో నేను కోలుకున్నాను. మీ అందరికి చాలా కృతజ్ఞతలు. దీని నుంచి కోలుకొని మరెంత బలంగా నేను మీ ముందుకు వస్తాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. ఇంటికి చేరుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ. మళ్ళీ ఎప్పటిలా ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jeremy Renner (@jeremyrenner)