Bigg Boss 5 : జెస్సి వెళ్ళిపోతూ కంటెస్టెంట్స్ కి సలహాలు.. నువ్వే నా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ..

నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో జెస్సి వెళ్ళిపోతూ స్టేజి మీదకు వచ్చి మిగిలిన కంటెస్టెంట్స్ కి సలహాలు ఇచ్చాడు. అయితే ఈ సలహాలు ఇవ్వడానికి ఒక్కొక్కరితో ల్యాండ్‌ఫోన్ ద్వారా మాట్లాడించాడు

Bigg Boss 5 : జెస్సి వెళ్ళిపోతూ కంటెస్టెంట్స్ కి సలహాలు.. నువ్వే నా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ..

Jessy

Bigg Boss 5 :  నామినేషన్లలో లేకపోయినా ఆరోగ్యం బాగోకపోవడంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి వెళ్ళిపోయాడు.ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో జెస్సి వెళ్ళిపోతూ స్టేజి మీదకు వచ్చి మిగిలిన కంటెస్టెంట్స్ కి సలహాలు ఇచ్చాడు. అయితే ఈ సలహాలు ఇవ్వడానికి ఒక్కొక్కరితో ల్యాండ్‌ఫోన్ ద్వారా మాట్లాడించాడు బిగ్ బాస్.

Nathy Kihara : బాడీలో ఆ ఒక్క పార్ట్‌కి 13 కోట్ల బీమా చేయించిన హీరోయిన్.. ఆ పార్ట్ ఏంటో తెలుసా??

ముందుగా జెస్సీ.. స‌న్నీతో మాట్లాడుతూ.. జాగ్ర‌త్త‌గా ఉండు, టెంప‌ర్ లూజ్ అవ‌కు. ఒక్క‌డిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువ‌ల్ హీరో అవుతావు, లేదంటే క‌మెడియ‌న్ అవుతావు అని అన్నాడు.
త‌ర్వాత మాన‌స్‌తో మాట్లాడుతూ.. నువ్వు సైలెంట్ కిల్ల‌ర్‌. ర‌వికే బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అంద‌రినీ నెగెటివ్‌గా చూడ‌కు అని సలహా ఇచ్చాడు.
కాజ‌ల్‌తో.. నీ గేమ్ ఏమైంది? నువ్వు ప‌క్క‌వాళ్ల‌ను హైలైట్ చేయ‌డానికి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నార‌నుకుంటున్నావు, కానీ వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో అని హెచ్చరించేలా చెప్పాడు.
యానీ మాస్ట‌ర్‌ తో తన గేమ్ బాగుంటుందని తెలిపాడు.

Aliya – Ranabir : మరో బాలీవుడ్ జంట పెళ్ళికి సిద్ధం.. త్వరలో నిశితార్థం
ప్రియాంక సింగ్‌ను త్యాగాలు చేసింది చాలు, ఇంక త్యాగాలు ఆపేసి నీ గేమ్ నువ్వు ఆడు అని అన్నాడు.
శ్రీరామ్ తో నువ్వు దేనిలో ఇన్వాల్వ్ అవ్వవు, నువ్వు కచ్చితంగా టాప్ 5లో ఉంటావు అని అన్నాడు.
ఇక రవిని.. వేరే వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైన‌ల్‌లో క‌లుస్తాను అని చెప్పాడు.
త‌ర్వాత సిరితో మాట్లాడుతూ.. నీ ఫైటింగ్ బాగుంటుంది, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పి కిస్సులు లేవా అని అడిగాడు. దీంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. వ‌చ్చేవారమే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌కు, ఫైన‌ల్‌దాకా ఉండు అని కూడా చెప్పాడు.
ష‌ణ్ముఖ్‌తో మాట్లాడుతూ.. హౌస్‌లో ఉన్న చివ‌రి రోజుల్లో నీతో ఉండ‌లేక‌పోయాన‌న్న‌దే నా బాధ. నేను ఎప్ప‌టికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే అన్నాడు. దీనికి షన్ను మాట్లాడుతూ.. నువ్వు ఫ‌స్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావ‌నుకున్నారు అంతా, కానీ ప‌దో వారంలో ఒక‌రికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్‌, అదిరా నా జెస్సీ అని పొగిడాడు.