Jigarthanda Doublex : హరీష్ శంకర్‌కి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగులో కూడా రిలీజ్ చేసేస్తున్నారు..

రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘జిగర్‌తండా డబులెక్స్’ని తెలుగు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ రీమేక్ లేనట్టే.

Jigarthanda Doublex : హరీష్ శంకర్‌కి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగులో కూడా రిలీజ్ చేసేస్తున్నారు..

Jigarthanda Doublex released in telugu too and so Harish Shankar remake no

Jigarthanda Doublex – Harish Shankar : సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో 2014లో తమిళ సినిమా ‘జిగర్‌తండా’. ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, 2015 జాతీయ అవార్డుల పురస్కారాల్లో రెండు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. దీంతో ఆ సినిమా పై పక్క ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు చూపు పడింది. ఇంకేముంది ఆ బ్లాక్ బస్టర్ ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Virupaksha : ఓటీటీకి వచ్చేస్తున్న విరూపాక్ష.. ఎప్పుడో తెలుసా?

తెలుగులో ఈ సినిమాని హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశాడు. ఈ రీమేక్ కూడా మంచి విజయన్ అందుకుంది. అయితే ఇటీవల జిగర్‌తండా తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్.. ఆ మూవీ సీక్వెల్ ని ప్రకటించి శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. ‘జిగర్‌తండా డబులెక్స్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సీక్వెల్ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

ఇక తెలుగులో గద్దలకొండ గణేష్ తో మంచి విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్.. ఈ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తాడా? అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో జిగర్‌తండా డబులెక్స్ టీం హరీష్ శంకర్ తో పాటు అందరికి షాక్ ఇచ్చారు. ఈ సీక్వెల్ ని తమిళ్ తో పాటు తెలుగు, హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది దీపావళికి మూవీ ఈ మూడు లాంగ్వేజ్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఒక గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. రాఘవ లారెన్స్ తెలుగులో కూడా మార్కెట్ ఉండడం వలనే డైరెక్ట్ రిలీజ్ కి వస్తున్నట్లు తెలుస్తుంది.