రీల్ హీరోనే..రియల్ గా విలన్: జానీ డెప్ పై భార్య తీవ్ర ఆరోపణలు

  • Published By: venkaiahnaidu ,Published On : January 6, 2019 / 07:56 AM IST
రీల్ హీరోనే..రియల్ గా విలన్: జానీ డెప్ పై భార్య తీవ్ర ఆరోపణలు

సినీ ప్రపంచంలో హీరోనే కానీ నిజజీవితంలో అతను ఒక రాక్షసడంటూ హాలీవుడ్ నటుడు జానీ డెప్ పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్ సినిమాల్లో జాక్ స్పార్ గా సీనీ లవర్స్ కు జానీ డెప్ సుపరచితుడే. అయితే జానీ డెప్ సినిమాల్లోనే హీరో అని, అతను ఓ నరరూప రాక్షసుడని, రోజూ తనను చావగొట్టేవాడని ఆయన భార్య అంబర్ హియర్డ్ ఆరోపించింది. 

2016లో ఈ దంపతులు విడాకుల కోసం అప్లయి చేసుకున్నారు.  ఇందులో భాగంగా అంబర్ హియర్డ్ తన భర్త తన పట్ల ప్రవర్తించిన తీరుకి సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకి సమర్పించగా అందులో కొన్ని బయటికొచ్చాయి. ఆ నరరూప రాక్షసుడి కారణంగా తాను ఓ బండరాయిని అయిపోయా అంటూ ఆమె తన వాంగూల్మంలో తెలిపింది. అయితే జానీ డెప్ పై ది సన్ పత్రిక వేసిన పరువు నష్టం కేసులో ఈ పత్రం కీలకంగా మారనుంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఆక్వామెన్ సినిమాలో మెరా పాత్రలో అంబర్ నటించిన విసయం తెలిసిందే.