Jr NTR: రీ-రిలీజ్ ట్రెండ్.. దూసుకొస్తున్న జూ.ఎన్టీఆర్..?

టాలీవుడ్‌లో ఇటీవల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ హీరో కూడా జాయిన్ కాబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమా గురించి అందరికీ తెలిసిందే.

Jr NTR: రీ-రిలీజ్ ట్రెండ్.. దూసుకొస్తున్న జూ.ఎన్టీఆర్..?

Jr NTR Aadi Movie To Get Re-Release

Jr NTR: టాలీవుడ్‌లో ఇటీవల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలను 4K వర్షన్‌లో చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. అటు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాలు దుమ్ములేపాయి. దీంతో అభిమానులు ఈ సినిమాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

NTR: కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తులు.. మరీ ఇంత మార్పా?

అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ హీరో కూడా జాయిన్ కాబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన తీరు, తారక్ విధ్వంసకర పర్ఫార్మెన్స్ కలగలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ హిట్‌గా నిలిపాయి. ఇక ఈ సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

NTR : అభిమానులకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. పోలీసులవల్లే అంటూ..

జూ.ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆది సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను నవంబర్ మూడవ వారంలో రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుందట. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఆది సినిమా రీ-రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద జూ.ఎన్టీఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.