Jr. NTR: పేరు మారిస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గదు.. వైఎస్సార్ స్థాయి పెరగదు.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ ట్వీట్!

బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి "వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ"గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయంపై నందమూరి, నారా కుటుంబాలు కూడా పెదవి విప్పగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా గళం విప్పాడు.

Jr. NTR: పేరు మారిస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గదు.. వైఎస్సార్ స్థాయి పెరగదు.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ ట్వీట్!

Junior NTR Reaction on NTR Health University Issue

Jr. NTR: బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి “వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల దగ్గర నుంచి సాధారణ ఓటర్లు వరకు పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

NTR Health University row: పేర్లు మార్చాలని అనుకుంటే ఈ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా?: పవన్ కల్యాణ్

ఇక ఈ విషయంపై నందమూరి, నారా కుటుంబాలు కూడా పెదవి విప్పగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా గళం విప్పాడు. “NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా ఇంకొకరి స్థాయి తగ్గదు.

విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు”.. అంటూ యూనివర్సిటీ పేరు మార్పుపై కొంచెం ఘాటుగానే స్పదించారు అనే చెప్పాలి.