Kajal Aggarwal: తనను తీసేసినా వదలని కాజల్.. ఏం చేసిందంటే?
అందాల భామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా సౌంత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. అయితే కాజల్ పెళ్లినాటికి ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తనను ఓ సినిమా నుండి తీసేసినా, కాజల్ మాత్రం ఏం ఫీల్ అవ్వలేదు. పైగా, సదరు చిత్ర టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి ఇప్పుడు అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది.

Kajal Aggarwal: అందాల భామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా సౌంత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. అయితే క్రమంగా సినిమాలు తగ్గుతుండటంతో, కేవలం పరిమితంగా సినిమాలను ఓకే చేస్తూ వచ్చింది. ఇక ఆ తరువాత పెళ్లి చేసుకోవడం, ఓ బిడ్డకు తల్లి కావడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే కాజల్ పెళ్లినాటికి ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
Kajal Aggarwal : మొదటిసారి తన బాబు ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్
కానీ, పెళ్లి తరువాత వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు ఈ బ్యూటీ. అటు ఆయా సినిమాల దర్శకనిర్మాతలు సైతం కాజల్ పెళ్లికావడంతో, వేరొక ఆప్షన్‌ను చూసుకున్నారు. అయితే ఇలా తనను ఓ సినిమా నుండి తీసేసినా, కాజల్ మాత్రం ఏం ఫీల్ అవ్వలేదు. పైగా, సదరు చిత్ర టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి ఇప్పుడు అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.. కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ది ఘోస్ట్’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటం.. కాజల్ పెళ్లి కూడా జరిగిపోవడంతో, ఈ సినిమాలో కాజల్ ప్లేస్‌లో మరొక బ్యూటీ సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నారు. ఇక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంఛ్ చేసింది. దీంతో ఈ సినిమాకు కాజల్ ఆల్ ది బెస్ట్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
https://t.co/xqliko0Zof goodluck team #TheGhost ! @iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @iamMarkKRobin #TheGhostOnOct5
— Kajal Aggarwal (@MsKajalAggarwal) August 26, 2022