Kangana Ranaut : చంద్రముఖి 2లో ఆమెని మ్యాచ్ చేయటం కష్టం అంటూ జ్యోతికని పొగిడేసిన కంగనా..

చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తుంది. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ని తీసుకున్నారు అని తెలియడంతో ఈ పాత్రకి ఆమె సూట్ అవ్వదు అంటూ పలువురు విమర్శలు చేశారు. వీటికి కంగనా కూడా.................

Kangana Ranaut : చంద్రముఖి 2లో ఆమెని మ్యాచ్ చేయటం కష్టం అంటూ జ్యోతికని పొగిడేసిన కంగనా..

kangana ranaut praise chandramukhi movie and jyothika

Kangana Ranaut :  2005లో వచ్చిన చంద్రముఖి సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించింది. వేరే భాషల్లో కూడా డబ్ అయి అక్కడ కూడా విజయం సాధించింది చంద్రముఖి. రజినీకాంత్, నయనతార జంటగా చంద్రముఖి పాత్రలో జ్యోతికతో ఈ సినిమా తెరకెక్కింది. చంద్రముఖిగా జ్యోతిక అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక రకంగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తుంది. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ని తీసుకున్నారు అని తెలియడంతో ఈ పాత్రకి ఆమె సూట్ అవ్వదు అంటూ పలువురు విమర్శలు చేశారు. వీటికి కంగనా కూడా గతంలోనే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మరోసారి చంద్రముఖి, జ్యోతిక గురించి మాట్లాడింది కంగనా.

Vedaant Madhavan : మరోసారి స్విమ్మింగ్ లో పతకాలు కొల్లగొట్టిన మాధవన్ తనయుడు..

గతంలో జ్యోతిక ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్స్ లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడిగితే కంగనా రనౌత్ అని చెప్పింది. కంగనా అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా కంగనా ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.. ఇది నాకు ఎంకరేజ్మెంట్ లాంటిది. చంద్రముఖి సినిమాలో జ్యోతిక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం చంద్రముఖి 2 క్లైమాక్స్ షూట్ చేస్తున్నాము. దీంతో నేను ఇప్పుడు ప్రతి రోజు చంద్రముఖి సినిమా, ఆమె నటనని చూస్తున్నాను. చంద్రముఖి సినిమాలో ఆమె అసాధారణమైన ప్రదర్శన ఇచ్చింది. ఆమెతో పోలుస్తూ ఇప్పుడు నేను యాక్ట్ చేయడం చాలా కష్టమే అంటూ పోస్ట్ చేసింది.