Kangana Ranaut: దశావతారాల్లో కనిపించనున్న క్వీన్!

కమల్ హాసన్ దశావతారం సినిమా తెలుగు ప్రేక్షకులు ఎంత సులభంగా మార్చిపోలేరు. బామ్మ దగ్గర నుండి అమెరికన్ ప్రెసిడెంట్ వరకు పది అవతారాల్లో కనిపించిన కమల్ ఆ సినిమాతో..

Kangana Ranaut: దశావతారాల్లో కనిపించనున్న క్వీన్!

Kangana Ranaut

Kangana Ranaut: కమల్ హాసన్ దశావతారం సినిమా తెలుగు ప్రేక్షకులు ఎంత సులభంగా మార్చిపోలేరు. బామ్మ దగ్గర నుండి అమెరికన్ ప్రెసిడెంట్ వరకు పది అవతారాల్లో కనిపించిన కమల్ ఆ సినిమాతో యూనివర్సల్ నటుడిగా తనకు తానే సాటిగా నిరూపించుకున్నాడు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా దశావతారంలో కనిపించేందుకు సిద్ధమైంది. తన తాజా సినిమా కోసం ఏకంగా పది అవతారాల్లో కనిపించనుంది. ఇందులో ఏ పాత్రకి ఆ పాత్ర వైవిధ్యంగా సాగనుండగా ప్రతి పాత్రలో కంగనా మార్క్ కనిపించనుందట.

సహజంగానే ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన సినిమాలతో పాటు క్యారెక్టర్ పరంగా ఓ రేంజ్ మైంటైన్ చేస్తున్న కంగనా ఎంచుకున్న పాత్రలో పూర్తిగా వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది. కాగా, ఇప్పుడు ఆమె నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ధాక్‌డ్‌’లో ఆమె పది అవతారాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నేపథ్యంలో స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రజనీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కథ పరంగా ఈ సినిమాలో కంగనా సీక్రెట్‌ ఏజెంట్‌, బార్‌ డ్యాన్సర్‌, వేశ్యతో పాటు మొత్తం పది పాత్రల్లో కనిపిస్తుందని సమాచారం. సినిమాలో కంగనా ప్రతి క్యారెక్టర్‌ కోసం విభిన్నమైన వేషధారణ, లుక్‌ మార్చి కనిపించనుంది. ఇప్పటికే హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ ఆధ్వర్యంలో కంగనాపై పోరాట ఘట్టాలను తెరకెక్కించగా ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఆమె 14 కేజీల బరువు తగ్గినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైతే కంగనా క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.