Kannada Movies : టాలీవుడ్ లో కూడా కన్నడ సినిమాల హవా..

తమిళ్ సినిమాలు ఎప్పుడూ టాలీవుడ్ కి దగ్గరే కానీ కన్నడ సినిమాలు మాత్రం అంతగా టచ్ లేదు తెలుగు జనానికి. కానీ కేజిఎఫ్ తర్వాత కొత్త కంటెంట్ తో కొత్త డైరెక్టర్లతో, కొత్తస్టార్లతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది కన్నడ సినిమా. ఇప్పటి వరకూ........

Kannada Movies : టాలీవుడ్ లో కూడా కన్నడ సినిమాల హవా..

Kannada Movies gets good results in tollywood

Kannada Movies :  తమిళ్ సినిమాలు ఎప్పుడూ టాలీవుడ్ కి దగ్గరే కానీ కన్నడ సినిమాలు మాత్రం అంతగా టచ్ లేదు తెలుగు జనానికి. కానీ కేజిఎఫ్ తర్వాత కొత్త కంటెంట్ తో కొత్త డైరెక్టర్లతో, కొత్తస్టార్లతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది కన్నడ సినిమా. ఇప్పటి వరకూ కేజిఎఫ్ తోప్ అనుకుంటే కేజిఎఫ్ ని మించి సినిమాలు వస్తున్నాయి.

కన్నడ సినిమాలతో పెద్దగా పరిచయం లేని తెలుగు ఆడియన్స్ ని కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాయి కన్నడ సినిమాలు. అంతకుముందు డబ్ అయినా కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించని కన్నడ సినిమాలపై తెలుగు ఆడియన్స్ ఇప్పుడు మనసు పారేసుకుంటున్నారు. కేజిఎఫ్ తో స్పీడందుకున్న ఈ కన్నడ సినిమాల క్రేజ్ ‘కాంతారా’తో పీక్స్ కి వెళ్లిపోయింది. కన్నడ సినిమా స్టామినాని వరల్డ్ వైడ్ గా పరిచయం చేసిన కేజిఎఫ్ ని చూసి తెలుగులో కూడా కన్నడ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిషబ్ శెట్టి హీరో, డైరెక్టర్ గా తెరకెక్కిన కాంతారా మూవీ ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్ అయ్యింది.

పుష్ప, కేజిఎఫ్ రేంజ్ యాక్షన్ మూవీస్ తో కంపేర్ చేస్తూ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న కాంతారా ఆల్రెడీ కన్నడ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ శుక్రవారం తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే కాంతారా IMDBలో కేజిఎఫ్ 8.4 రేటింగ్ ని మించి 9.6 టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సెలబ్రిటీలు సినిమాని తెగ పొగిడేస్తున్నారు.

Unstoppable : బాలయ్య క్రష్ ఎవరో తెలుసా.. హీరోయిన్ కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య..

తెలుగులో ఈమధ్య కన్నడ సినిమాలు బాగా క్రేజ్ సంపాదించుకున్నాయి. ఆల్రెడీ కన్నడ లో సూపర్ హిట్ అయిన మరో కన్నడ మూవీ చార్లీ 777 కూడా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. మరో కన్నడ స్టార్ సుదీప్ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రాంత్ రోణ కూడా టాలీవుడ్ ని ఆకట్టుకుంది. తెలుగులో పునీత్ రాజ్ కుమార్ జేమ్స్, యువరత్న కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలా డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న కన్నడ సినిమాలు తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు తమ సినిమాలపై క్రేజ్ కూడా పెంచుకుంటున్నాయి.