Adipurush : ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ని ఫ్రీగా ఇస్తున్నారు.. కానీ వాళ్ళకి మాత్రమే!

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ని కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఆ ఫ్రీ టికెట్స్ కేవలం..

Adipurush : ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ని ఫ్రీగా ఇస్తున్నారు.. కానీ వాళ్ళకి మాత్రమే!

Karthikeya 2 producer Abhishek Agarwal provide 10000 free tickets for Adipurush

Adipurush : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. జూన్ 16న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని, మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమా పై ఆసక్తిని కలగజేస్తున్నారు. సెకండ్ ట్రైలర్ తో అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశారు.

LGM Teaser : ధోని నిర్మిస్తున్న సినిమా రెడీ అయ్యింది.. టీజర్ రిలీజ్..

కాగా శ్రీరాముడిని మనం ఆదర్శవ్యక్తిగా భావిస్తుంటాం. అలాంటి రామకథని దేశంలోని ప్రతి ఒక్కరు చూడాలి. ముఖ్యంగా రాబోయే తారలు రాముడి గురించి తప్పక తెలుసుకోవాలని కార్తికేయ 2 (Karthikeya 2) నిర్మాత అభిషేక్ అగర్వాల్.. 10 వేల టికెట్స్ ఆదిపురుష్ టికెట్స్ ని తన తరుపు నుంచి ఫ్రీగా డొనేట్ చేశాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, అనాధ శరణాలయాలకు, వృధాశ్రమాలకు ఈ టికెట్స్ ని డొనేట్ చేశారు. ఈ టికెట్స్ పొందడానికి ఒక గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫ్రీ టికెట్స్ మీకు లభిస్తాయి.

Adipurush : ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు.. స్పందించిన మూవీ టీం!

ఆ గూగుల్ ఫార్మ్ సంబంధించిన లింక్ ని కింద జత చేసిన ట్వీట్ లో ఉంది. అది గమనించి రామకథకి టికెట్స్ ని ఫ్రీగా పొందండి. కాగా ఈ సినిమా చూడడానికి దళితులకు ప్రవేశం లేదంటూ ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిని ఎవరు నమ్మకండి. ఆ వార్తలో నిజం లేదని, అది దుష్ప్రచారం అంటూ మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. అలాగే రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ప్రతి థియేటర్ లో హనుమంతుడు కోసం ఒక సీటుని మూవీ టీం కేటాయిస్తుంది. థియేటర్ కి వెళ్ళినప్పుడు ఆ సీటుని గమనించండి.