Katrina Kaif: క్యాట్-విక్కీ మ్యారేజ్ మిస్టరీ.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్!

బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌషల్-కత్రినా పెళ్లికి రెడీఅవుతున్నారు. డిసెంబర్ లో 3 రోజుల ప్లాన్ చేసిన ఈ పెళ్లికి ఓ రేంజ్ లో అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి.

Katrina Kaif: క్యాట్-విక్కీ మ్యారేజ్ మిస్టరీ.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్!

Katrina

Katrina Kaif: బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌషల్-కత్రినా పెళ్లికి రెడీఅవుతున్నారు. డిసెంబర్ లో 3 రోజుల ప్లాన్ చేసిన ఈ పెళ్లికి ఓ రేంజ్ లో అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అటెండ్ అవుతున్నారంటూ బాలీవుడ్ లో ఊదరగొట్టేస్తున్నారు. మరోవైపు విక్కీ సిస్టర్ మాత్రం.. పెళ్లి లేదు.. గిళ్లీ లేదు.. అసలు వాళ్లకా ఉద్దేశ్యమే లేదంటోంది.

December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

బాలీవుడ్ హాట్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ కి ఎంగేజ్ మెంట్ చేసేసిన మీడియా ఈ క్రేజీ కపుల్ కి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. అంతేకాదు విక్కీ, కత్రినా పెళ్లికి సంబందించి రోకా సెర్మనీ కూడా అయిపోయిందని, ఇంకా పెళ్లికి 10 రోజులు మాత్రమే ఉండడంతో పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయని న్యూస్ కూడా గట్టిగా వినిపిస్తోంది. కొన్నాళ్లుగా క్లోజ్ గా ఉంటున్న కత్రినా, విక్కీ కౌషల్ మధ్య ఫ్రెండ్ షిప్ కాదు.. ఇంకేదో ఉందంటూ తెగ హడావిడి చేస్తూనే ఉంది సోషల్ మీడియా.

Hebah Patel: ‘అబ్బా.. హెబ్బా’.. ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న పిక్స్

వీళ్లిద్దరికీ సీక్రెట్ గా బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో ఎంగేజ్ మెంట్ జరిగిందని డిసెంబర్ 7,8న మెహందీ సంగీత్ ఫంక్షన్స్ తో పాటు డిసెంబర్ 9న గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నారని బాలీవుడ్ కోడైకూస్తోంది. వీటన్నింటి కంటే ముందే ముంబై లో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కోర్టు మ్యారేజ్ చేస్కుంటున్నారని కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Nayanthara: అటు రజని.. ఇటు ధనుష్.. మధ్యలో నయన్!

200 మంది మాత్రమే ఇన్వటేషన్ ఉన్న కత్రినా, విక్కీ కౌషల్ పెళ్లికి సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ కూడా అటెండ్ అవుతున్నారని ఒకవైపు మీడియా గెస్ట్ లిస్ట్ రెడీ చేస్తుంటే.. అసలు పెళ్లీలేదు గిళ్లీ లేదంటోంది విక్కీ కౌషల్ సిస్టర్. అసలు వీళ్లిద్దరికీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, అసలు డిసెంబర్ లో పెళ్లి అనే మాట అంతా అబద్దం అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ రేంజ్ లో పెళ్లి రూమర్స్ మీడియా స్ప్రెడ్ అవుతున్నా.. ఇప్పటి వరకూ కత్రినా గానీ, విక్కీ కానీ.. రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ మ్యారేజ్ మిస్టరీ ఏంటా అని కన్ ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్.