K.G.F 2 : ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ పీక్స్..

ఈ ఏడాది బాక్సాఫీస్ క్లాష్‌లో ఎవరు విన్ అవుతారు? అంటూ ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించారు ట్రేడ్ వర్గాల వారు..

K.G.F 2 : ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ పీక్స్..

Kgf 2

K.G.F 2: పాండమిక్ తర్వాత సినిమా రంగం కాస్త ఊపిరి పీల్చుకుంది. టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలో షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. థియేటర్లు తెరుచుకోవడంతో రిలీజులు, మెల్లగా 100 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో తిరిగి పూర్వస్థితికి చేరుకుంటాం అనుకుంటుంటే సీన్ రివర్స్ అయింది.

Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ అవుతున్నాయి. చాలా వరకు షూటింగ్స్ నిలిచిపోయాయి. రిలీజుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి.

Hrithik-Ranbir : బాలీవుడ్ బిగ్ క్లాష్..

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది బాక్సాఫీస్ క్లాష్‌లో ఎవరు విన్ అవుతారు? అంటూ ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించారు ట్రేడ్ వర్గాల వారు. ఈ పోల్‌లో ‘కె.జి.యఫ్ 2’ అత్యధికంగా 54.6 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 38.2 శాతం ఓట్లతో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ 7.2 శాతం ఓట్లతో థర్డ్ ప్లేస్‌లో ఉంది.

Votes