KGF 2 : సొంత రాష్ట్రంలో ‘బీస్ట్’ని బీట్ చేసిన ‘కేజిఎఫ్ 2’

ఇప్పుడు విజయ్ సొంత రాష్ట్రం, సొంత సిటీలోనే బీస్ట్ ని దెబ్బ కొట్టింది కేజిఎఫ్. చెన్నైలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన దగ్గర్నుంచి బీస్ట్ డామినేషన్ సాగినా కేజిఎఫ్ పోటీ ఇస్తూనే........

KGF 2 : సొంత రాష్ట్రంలో ‘బీస్ట్’ని బీట్ చేసిన ‘కేజిఎఫ్ 2’

Kgf 2

 

Beast :  ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజిఎఫ్ 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ అవ్వగా, ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 రిలీజ్ అయింది. రెండు సినిమాలని భారీగానే ప్రమోషన్ చేశారు. చెప్పాలంటే కేజిఎఫ్ 2 కంటే బీస్ట్ ని ఎక్కువే ప్రమోట్ చేశారు. ఎప్పుడూ లేనిది విజయ్ కూడా ఈ సారి ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొన్నారు.

 

ముందు నుంచి తమిళనాడులో బీస్ట్ డామినేషన్ ఉన్నా దేశం మొత్తం మాత్రం ‘కేజిఎఫ్ 2’ డామినేషన్ ఉంటుంది అని అంతా భావించారు. అనుకున్నట్టే అదే జరిగింది. బీస్ట్ మొదటి రోజే భారీ నెగిటివ్ టాక్ ని తెచ్చుకోగా కేజిఎఫ్ 2 మాత్రం భారీ విజయం సాధించి కలెక్షన్లని కొల్లగొడుతుంది. మొదటి నుంచి తమిళనాడులో బీస్ట్ డామినేషన్ ఉంటుంది అనుకున్నారు అంతా. అయితే తమిళనాడులో కూడా బీస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్ కి తమిళనాడులో బీస్ట్ సినిమాని బీట్ చేసేసింది కేజిఎఫ్ 2.

Prashanth Varma : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు బ్యాడ్మింటన్ లో పతకాలు.. అదరగొట్టేస్తున్న యంగ్ డైరెక్టర్

ఇప్పటికే తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతాలలో చాలా థియేటర్స్ లో కేజిఎఫ్ కోసం బీస్ట్ ని తీసి పక్కనపెట్టేశారు. బాలీవుడ్ లో అయితే బీస్ట్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు కూడా. ఇప్పుడు విజయ్ సొంత రాష్ట్రం, సొంత సిటీలోనే బీస్ట్ ని దెబ్బ కొట్టింది కేజిఎఫ్. చెన్నైలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన దగ్గర్నుంచి బీస్ట్ డామినేషన్ సాగినా కేజిఎఫ్ పోటీ ఇస్తూనే ఉంది. తాజాగా సోమవారం కలెక్షన్స్ లో బీస్ట్ ని కేజిఎఫ్ దాటేసింది.

Shivaraj Singh Chouhan : అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్.. తెలుగు సినిమాపై మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు..

చెన్నై సిటీలో సోమవారం బీస్ట్ సినిమా 36 లక్షలు కలెక్ట్ చేయగా, కేజిఎఫ్ మాత్రం 62 లక్షలు సాధించి రికార్డు సృష్టించింది. మొత్తానికి తమిళనాడులో కూడా కేజిఎఫ్ డామినేషన్ మొదలైపోయింది. ప్రస్తుతం ఏ సినిమాలు లేకపోవడంతో ఈ వారమంతా కూడా తమిళనాడులో కేజిఎఫ్ డామినేషన్ కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే దీనిపై విజయ్ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.