KRK : నీ బాయ్‌ఫ్రెండ్ ని రిజెక్ట్ చేసినట్టే నిన్ను కూడా బాలీవుడ్ నుంచి పంపించేస్తాం.. రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ సంచలన ట్వీట్..

తాజాగా బాలీవుడ్ క్రిటిక్, పలువురు నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే KRK రష్మికపై ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. మేడం రష్మిక జీ, మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి..............

KRK : నీ బాయ్‌ఫ్రెండ్ ని రిజెక్ట్ చేసినట్టే నిన్ను కూడా బాలీవుడ్ నుంచి పంపించేస్తాం.. రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ సంచలన ట్వీట్..

KRK Sensational tweet on rashmika and vijay

KRK :  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది. ఇక రష్మిక నటించిన తమిళ వరిసు సినిమా నేడు రిలీజ్ కానుంది. అలాగే తను నటించిన బాలీవుడ్ సినిమా మిషన్ మజ్ను ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కానుంది. దీంతో గత కొన్ని రోజులుగా రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది.

తాజాగా రష్మికని, విజయ్ దేవరకొండని కలిపి ఓ బాలీవుడ్ క్రిటిక్ సంచలన ట్వీట్ చేశాడు. విజయ్ దేవరకొండ రష్మిక డైరెక్ట్ గా చెప్పకపోయినా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అంతా అనుకుంటున్నారు. ఇక విజయ్ ఇటీవలే లైగర్ సినిమాని ఓ రేంజ్ లో ఓవర్ గా ప్రమోట్ చేసి అది ఫ్లాప్ అవ్వడంతో మొత్తానికి సైలెంట్ అయిపోయాడు. ఆ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్ కి అసలు ఎంట్రీనే లేకుండా పోయింది.

తాజాగా బాలీవుడ్ క్రిటిక్, పలువురు నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే KRK రష్మికపై ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. మేడం రష్మిక జీ, మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలా అయితే పంపించేశామో మిమ్మల్ని కూడా అలాగే పంపించబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి సినిమాల్లో చూడటం మాకు సంతోషాన్నిస్తుంది అని పోస్ట్ చేశాడు.

Dil Raju : మళ్ళీ దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. థియేటర్స్ గొడవ.. శివరాత్రికి కూడా థియేటర్స్ బ్లాక్??

అంతేకాకుండా మరో ట్వీట్ లో.. రష్మికని నేషనల్ క్రష్ అని పిలిచే వాళ్లంతా ఒకసారి ఐ చెకప్ చేయించుకోండి. రష్మికని రవికిషన్, కేసరి లాల్, పవన్ సింగ్ లాంటి వాళ్ళతో వర్క్ చేస్తే చూడాలని ఉంది. అక్కడ తను బాగా రాణించగలదు అంటూ డీగ్రేడ్ చేసి మాట్లాడాడు. దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారడంతో రష్మిక, విజయ్ ఫ్యాన్స్ KRK ని దారుణంగా విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.