Sankranthi Movies : సినిమాల పండుగ.. సంక్రాంతి సినిమాలు..

సంక్రాంతి వచ్చిందంటే.. సంతోషం సంబరంగా మారుతుంది. ఆనందం అందరింటా సందడి చేస్తుంది. వాటితో పాటు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాలు కూడా సిద్ధంగా ఉంటాయి...............

Sankranthi Movies : సినిమాల పండుగ.. సంక్రాంతి సినిమాలు..

last five years sankranthi movies

Sankranthi Movies :  సంక్రాంతి వచ్చిందంటే.. సంతోషం సంబరంగా మారుతుంది. ఆనందం అందరింటా సందడి చేస్తుంది. వాటితో పాటు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాలు కూడా సిద్ధంగా ఉంటాయి. 2023 సంక్రాంతిని పలు భారీ చిత్రాలు థియేటర్స్ ను హోరెత్తిస్తున్నాయి. అయితే గత 5 ఏళ్ళలో ఇదే సంక్రాంతి సీజన్ ను అసలైన పండగలా మార్చిన సినిమాలు ఏంటి? ఆ సినిమాల విశేషాలేంటో తెలుసుకుందాం.

2023 సంక్రాంతి గత పండగల కన్నా భిన్నం. ఈసారి కోలీవుడ్, టాలీవుడ్ కలిసి సంక్రాంతి సీజన్ ను కలర్ ఫుల్ గా మార్చేశాయి. రిలీజైన నాలుగింటిలో రెండు తెలుగు, రెండు తమిళ సినిమాలు ఫ్యాన్స్ కు అన్ స్టాపబుల్ వినోదాన్ని అందించాయి. టాలీవుడ్ లోని సంక్రాంతి వార్ లో ముందుగా పంజా విసిరింది బాలయ్య ‘వీరసింహారెడ్డి’. గాడ్ ఆఫ్ మాసెస్ గా ఫ్యాన్స్ పిలుచుకొనే బాలయ్య డైనమైట్స్ లాంటి డైలాగ్స్, గూస్ బంప్స్ తెచ్చిపెట్టే పెర్ఫార్మెన్స్ టీజర్ అండ్ ట్రైలర్ లో చూసి ఊగిపోయిన జనం జనవరి 12న థియేటర్స్ లో మాస్ జాతర జరిపారు. గోపీచంద్ మలినేని టేకింగ్, తమన్ మ్యూజిక్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ తర్వాత రోజు థియేటర్స్ లోకి దిగిపోయింది. రిలీజ్ కు ముందు టీజర్ అండ్ ట్రైలర్ లోని చిరు వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్, యాక్షన్ స్టైల్, పెర్ఫార్మెన్స్ పవర్, ఫ్యాన్స్ లో పూనకాల్ని లోడ్ చేశాయి. జనవరి 13న ఏకంగా థియేటర్స్ అన్నీ మాస్ యూఫోరియాతో ఊగిపోయాయి. తమిళ స్టార్ హీరో అజిత్ ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ గా జనవరి 11న రిలీజైంది. అదే రోజున తమిళంలోనూ ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ అందించింది. బ్యాంక్ దోపిడీ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లింగ్ యాస్పెక్ట్స్ తో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక దళపతి విజయ్ ‘వారిసు’ తమిళ సినిమా ఇక్కడ వారసుడుగా జనవరి 14న థియేటర్స్ లోకి దిగిపోయింది. వంశీ పైడిపల్లి డైరెక్షస్ లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. తన ఫ్యామిలీ సంరక్షణ కోసం ఒక గొప్పింటి కుర్రాడు ఎలాంటి బాధ్యత తీసుకున్నాడు?

ఇక సంక్రాంతి సీజన్ లో ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న సినిమా కూడా సందడి చేసింది. అదే ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్ , ప్రియా భవానీ శంకర్ జోడీగా నటించిన ఈ సినిమాకి అనిల్ కుమార్ డైరెక్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ అయింది.

2022 సంక్రాంతి విషయానికొస్తే .. ఈ సీజన్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కానీ టోటల్ రేస్ లో ఒక సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తెచ్చుకొని విజేతగా నిలిచింది. జనవరి 15న రిలీజైన నాగార్జున, నాగచైతన్య విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ బంగార్రాజు. ఫస్ట్ డే నుంచి మంచి టాక్ తో దూసుకుపోయింది. కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే జనవరి 14నే మూడు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ పర్వాలేదనిపించుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ , రచితా రామ్ నటించిన లవ్ స్టోరీ సూపర్ మచ్చి డిజాస్టర్ అయింది. ఇంకా యం.యస్ రాజు డైరెక్షన్ లో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 6 డేస్ 7 నైట్స్ కూడా డిజాస్టార్ గా నిలిచింది. మొత్తానికి 2022 సంక్రాంతి రేస్ లో నాగ్ బంగార్రాజు విజేతగా నిలిచింది.

2021 సంక్రాంతికి థియేటర్లు తెరుచుకుంటాయా సినిమాలు విడుదలవుతాయా అనుకున్న ప్రేక్షకులు కొంతలో కొంత హ్యాపీగానే ఫీలయ్యారు. 2021 సంక్రాంతికి 4 సినిమాలు విడుదల కాగా వాటిలో ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ అవడం విశేషం. మాస్ మహారాజా రవితేజ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ 2021 సంక్రాంతి సీజన్ లో జనవరి 10న రిలీజైంది. ఫస్ట్ డే మొదటగా పడిన షో నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రవితేజ మాస్ పోలీస్ గా అదరగొట్టిన ఈ సినిమా 70 కోట్లు కలెక్ట్ చేసింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు. జనవరి 13న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబో మూవీ బీస్ట్ రిలీజైంది. దీనికి తెలుగులో అంతగా రెస్పాన్స్ రాలేదు కానీ. తమిళంలో మాత్రం రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్‌’కు ఇది రీమేక్‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్‌ డ్యూయల్ రోల్ చేశాడు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటించిన ఈ సినిమా 2021 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక అదే రోజు రిలీజైన బెల్లకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ రిలీజైంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కామెడీతో పర్వాలేదనిపించినా కలెక్షన్స్ రాలేదు. ఈ సంక్రాంతి సీజన్ లో రవితేజ క్రాక్ మూవీ యునానిమస్ గా విన్నర్ గా నిలిచింది.

2020 సంక్రాంతి వార్ లో కూడా మొత్తం నాలుగు సినిమాలు పోటీ పడగా వాటిలో ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ. అయితే ఈ వార్ లో ఏకంగా రెండు సినిమాలు విన్నర్స్ గా నిలిచాయి. 2020 జనవరి 9న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ రిలీజైంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ కు ముందు మంచి క్రేజే వచ్చినప్పటికీ. తమిళ నాట సైతం ఈ సినిమాకి యావరేజ్ కలెక్షన్సే వచ్చాయి. నయనతార హీరోయిన్ గా నటించినప్పటికీ రెండు భాషల్లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. ఆ ఏడాది జనవరి 11న మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మహేశ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, అనిల్ కామెడీ ట్రీట్ మెంట్ ఈ సినిమాకి మంచి రీచ్ వచ్చేలా చేశాయి. 75 కోట్లు బడ్జెట్ పెడితే.. దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసింది. జనవరి 12న అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ అల వైకుంఠపురములో రిలీజైంది. ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వినిపించింది. తమన్ సంగీతంలోని పాటలు ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేశాయి. బన్నీ స్టైలిష్ పర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ అయింది. 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే దాదాపు 250 కోట్లు కురిపించింది. ఇక ఇదే రేస్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా మూవీ రిలీజైంది. సతీశ్ వేగేశ్న డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పూర్ కలెక్షన్స్ తెచ్చుకుని యావరేజ్ గా నిలిచింది.

2019 సంక్రాంతి వార్ లో మొత్తం నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో మూడు స్ట్రైట్ మూవీస్ అయితే ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ అవడం విశేషం. అయితే ఆ హోరాహోరీ పోరులో ఒక సినిమానే విన్నర్ గా నిలిచింది. 2019 జనవరి 9న బాలయ్య హీరోగా బయోపిక్ మూవీ ‘యన్టీఆర్ కథానాయకుడు’ రిలీజైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈసినిమాకి విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి కానీ, కలెక్షన్స్ మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ చేశాయి. 72 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కేవలం 23 కోట్లు లోపు కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెట్టుబడిలో 32 శాతం మాత్రమే రికవరీ జరిగింది. ఇక 2019 జనవరి 10 విడుదలైన రజినీకాంత్ రీమేక్ మూవీ ‘పేట’ కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ ఆయన్ని స్క్రీన్స్‌పై చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. తమిళంలో ఈ సినిమాకి యావరేజ్ టాక్ దక్కింది. అయితే తెలుగులో ఈ సినిమా ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. థియేటర్స్ లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్‌గా మారింది. ఇక జనవరి 11న రామ్ చరణ్ వినయ విధేయ రామ రిలీజైంది. సంక్రాంతి బరిలో రంగస్థలం సినిమాతో మార్కెట్ రేటు రెండింతలు పెంచుకున్న రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్‌ మూవీ అంటూ హిట్ పక్కా అనే ధీమా వ్యక్తమైంది. అయితే సినిమా విడుదల తరువాత లెక్కలు మారిపోయాయి. ప్రేక్షకుల అంచనాలకు ఆమడ దూరంలోనే ఆగిపోయింది సినిమా. ఓపెనింగ్స్ బాగున్నప్పటకీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 93 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. కానీ 60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. పెట్టుబడిలో కేవలం 60 శాతం మాత్రమే రికవరీ అయింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘F2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 జనవరి 12న విడుదలై థియేటర్స్‌లో నవ్వులు కురిపించింది. చానాళ్ల తరువాత వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ టైమింగ్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి బాగా యూజ్ చేసుకున్నాడు. 34 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగితే ఏకంగా 50 కోట్ల వసూళ్ళు దక్కాయి. 150 శాతం రికవరీ అయింది. సో 2019 సంక్రాంతికి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమైతే ‘F2’ అనే చెప్పాలి.

వినోదం వేడుకలా వెలుగొందేది సంక్రాంతి సీజన్ లోనే. సంతోషాన్ని, ఆనందాన్ని సంబరంగా మార్చే ఈ పండుగ థియేటర్స్ ను కూడా కళకళలాడేలా చేస్తుంది.