Liger : మైక్ టైసన్‌తో రౌడీ స్టార్.. అమెరికాలో మొదలైన రచ్చ

ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా మైక్ టైసన్ తో షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా టీం

10TV Telugu News

Liger :  రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘లైగర్’. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ లు కలిసి నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ షూటింగ్ ఇన్ని రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

Movies : ఈ వారం థియేటర్లో/ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే..

ఈ సినిమాని బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అయితే ఇందులో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా మైక్ టైసన్ తో షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా టీం ఇటీవల అమెరికా వెళ్లారు. ఇవాళ్టి నుంచి అమెరికాలో మైక్ టైసన్ తో షెడ్యూల్ జరగనుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఉన్న సీన్స్ ని షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ లో ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని సినిమా టీం బయటకి రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

×