Like Share And Subscribe Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ!

టాలీవుడ్ దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Like Share And Subscribe Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ!

Like Share And Subscribe Movie Completes Censor Work

Like Share And Subscribe: టాలీవుడ్ దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Santosh Shobhan : లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ ట్రైలర్ రిలీజ్.. కామెడీ అనుకున్నాం, యాక్షన్ కూడా ఓ రేంజ్‌లో ఉందిగా..

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ట్రావెల్ కామెడీ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా తీర్చిదిద్దినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.

Faria Abdullah : ఐదేళ్లలో పాన్ వరల్డ్ హీరోయిన్.. పదేళ్లలో డైరెక్షన్.. చిట్టికి కోరికలు చాలానే ఉన్నాయిగా..

కాగా ఈ సినిమాలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మిర్చి కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆముఖ్త క్రియేషన్స్, నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తుండగా, ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. నవంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.