Lucifer : చిరు రీమెక్ సినిమా..టైటిల్ ఇదేనా ?

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది. దీంతో నెక్ట్స్ ఫిల్మ్ పై చిరు ఫోకస్ చేశారు. మలయాళ భాషలో వచ్చిన ‘లూసిఫర్’ రీమెక్ కు రెడీ అవుతున్నారు.

Lucifer : చిరు రీమెక్ సినిమా..టైటిల్ ఇదేనా ?

Megastar

Lucifer Remake Title : మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది. దీంతో నెక్ట్స్ ఫిల్మ్ పై చిరు ఫోకస్ చేశారు. మలయాళ భాషలో వచ్చిన ‘లూసిఫర్’ రీమెక్ కు రెడీ అవుతున్నారు. చిరంజీవి 153వ చిత్రంగా నిర్మితమౌతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

Read More : Petrol Rate : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు

ఆగస్టు నెలలో ప్రారంభోత్సవం జరుపుకొంటోందని తెలుస్తోంది. ఈ సినిమా మూల కథకు భారీగా మార్పులు..చేర్పులు చేశారని టాక్. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు విధంగా మార్పులు చేసి స్క్రిప్ట్ రెడీ చేశారు. అయితే..సినిమాకు ఏ టైటిల్ పెడితే బాగుంటుందనే దానిపై చిత్ర యూనిట్ సమాలోచనలు చేస్తోంది. కింగ్ మేకర్..తదితర టైటిల్ పరిశీలించారు. చివరకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం. లూసిఫర్ రీమెక్ మీద బాగానే కసరత్తులు జరిపారు. తొలుత దర్శకుడు వినాయక్ సెట్ చేయలేక తప్పుకున్నారు. అనంతరం ఈ స్థానంలో మోహన్ రాజా ఫిక్స్ అయ్యారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read More :Samantha Ramsdell : వామ్మో.. ఎంత పెద్దనోరు ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసిందిగా!

‘ఆచార్య’ సినిమానే కంప్లీట్ కాలేదు.. ‘లూసిఫర్’ తెరకెక్కేదెప్పుడో అనుకున్న ఆడియెన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్. ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశానని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతోందని చెప్పారు మోహన్ రాజా.. లాక్‌డౌన్‌తో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చెయ్యడం లేటయిన ‘లూసిఫర్’ ని చకచకా ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. అంతేకాదు ‘లూసిఫర్’ సినిమాని 4,5 నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్ అండ్ టీమ్.