Mahesh Babu: మాంత్రికుడి కారణంగా టక్ చేస్తోన్న మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ట్ చేసి, తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ పూర్తి ఎంటర్‌టైనింగ్ కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Mahesh Babu: మాంత్రికుడి కారణంగా టక్ చేస్తోన్న మహేష్..?

Mahesh Babu To Be Seen As A Software Engineer In Trivikram Movie

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ట్ చేసి, తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ పూర్తి ఎంటర్‌టైనింగ్ కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

మహేష్ కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్‌ను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చూపించబోతున్నాడట. ఈ పాత్ర కోసం మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. ఈ పాత్రలో మహేష్ టక్ చేసుకుని కనిపిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో మహేష్ లుక్స్ పరంగా కూడా చాలా అందంగా కనిపించనున్నాడట. ఇక టక్ చేసిన మహేష్‌ను చూసి అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Mahesh Babu: ఫస్ట్ షెడ్యూల్ ముగించేసిన మహేష్.. ఇక దసరా తరువాతే!

మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి టక్ చేసిన మహేష్ ఎంత స్టైలిష్‌గా కనిపిస్తాడో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.