Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్ | Major Trailer Viewed By Defence Minister Of India

Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్

యంగ్ హీరో అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో మేజర్ ఉన్నికృష్ణన్...

Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్

Major: యంగ్ హీరో అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

MAJOR : ‘మేజర్’.. విడుదల వాయిదా..

తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌కు చూపెట్టింది మేజర్ చిత్ర యూనిట్. ఆయన ఈ ట్రైలర్ చూసి చిత్ర యూనిట్‌ను అభినందించినట్లు తెలుస్తోంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథను తెరకెక్కిస్తున్న ‘మేజర్’ చిత్ర యూనిట్‌ను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఇక ఈ సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడివి శేష్ ప్రాణం పెట్టి నటించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దేశభక్తిని చాటిచెప్పే సీన్స్ ఈ సినిమాలో బోలెడన్ని ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

Major : నా కుమారుడి బయోపిక్‌కి 100 శాతం న్యాయం చేయలేరు : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి

అడివి శేష్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శశి కిరణ్ తిక్కా డైరెక్ట్ చేయగా, తెలుగు-హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏప్లస్ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక మే 9న మేజర్ ట్రైలర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేస్తుండగా, జూన్ 3న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

×