Malaika-Arjun Kapoor : ఎట్టకేలకి పెళ్లి కబురు చెప్పిన మలైకా.. 2023 లో కన్ఫర్మ్ అంట..

మూవింగ్ విత్ మలైకా అంటూ ఇంట్రస్టింగ్ టాక్ షో చేస్తున్న మలైకా అరోరా ఈ షోలోనే తన పెళ్లి మాట బయటపెట్టింది. మలైకా, అర్జున్ కపూర్ లు చాలా రోజుల నుంచి డేటింగ్ లోఉన్నా 2019లోనే అఫీషియల్ గా ఈ విషయం షేర్ చేసుకున్నారు. మలైకాకి 48 ఏళ్లు, అర్జున్ కపూర్ కి 36 ఏళ్లు. తనకంటే..............

Malaika-Arjun Kapoor : ఎట్టకేలకి పెళ్లి కబురు చెప్పిన మలైకా.. 2023 లో కన్ఫర్మ్ అంట..

Malaika Arora and Arjun Kapoor wants to marry in 2023

Malaika-Arjun Kapoor :  కొత్త సంవత్సరం అందరూ కొత్త కొత్త ప్లాన్స్ తో రెడీ అవుతున్నారు. ఇది చేద్దాం, అది చేద్దామని ఫిక్సయిపోతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా న్యూఇయర్ ప్లాన్స్ గట్టిగానే వేసింది. తన సింగిల్ స్టేటస్ కి బై చెప్పి హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యింది. అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా న్యూఇయర్ ప్లాన్స్ బయటపెట్టింది.

మూవింగ్ విత్ మలైకా అంటూ ఇంట్రస్టింగ్ టాక్ షో చేస్తున్న మలైకా అరోరా ఈ షోలోనే తన పెళ్లి మాట బయటపెట్టింది. మలైకా, అర్జున్ కపూర్ లు చాలా రోజుల నుంచి డేటింగ్ లోఉన్నా 2019లోనే అఫీషియల్ గా ఈ విషయం షేర్ చేసుకున్నారు. మలైకాకి 48 ఏళ్లు, అర్జున్ కపూర్ కి 36 ఏళ్లు. తనకంటే 12 ఏళ్లు పెద్దదైనా సరే మలైకాతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన అర్జున్. మలైకాని పెళ్లి చేసుకోవాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మలైకా కూడా అర్జున్ తో పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. కొత్త సంవత్సరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నట్టు చెబుతోంది మలైకా.

Sankranthi Movies : ఈ సారి సంక్రాంతి దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజు తీసుకున్నాడా ??

మలైకా – అర్జున్ కపూర్ పెళ్లి బాలీవుడ్ లోనే ఇంట్రస్టింగ్ మ్యారేజ్ అవ్వబోతోంది. మలైకా, తన మాజీ భర్త ఆర్బాజ్ తమ 20ఏళ్ల పెళ్లిని రద్దు చేసుకుని ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఆర్బాజ్ వేరే రిలేషన్ లో ఉన్నా మలైకా అర్జున్ కపూర్ తో ఉన్నా కొడుకు ఆర్హన్ కోసం మాత్రం ఇద్దరూ కలుస్తూనే ఉంటారు. మలైకా ప్రేమకి తన 20ఏళ్ల కొడుకు కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే మలైకా కూడా పెళ్ళి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని కంటిన్యూ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటోంది. మరి 2023లో ఈ స్పెషల్ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి.