Manchu Vishnu : ఆరు నెలల్లో 'మా' బిల్డింగ్ మొదలు పెడతాను.. మంచు విష్ణు కామెంట్స్.. | Manchu Viahnu speaks about Maa Building

Manchu Vishnu : ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్ మొదలు పెడతాను.. మంచు విష్ణు కామెంట్స్..

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ''మరో ఆరునెలలలోపే 'మా' బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. 'మా‌' సభ్యుల వెల్పేర్, హెల్త్.............

Manchu Vishnu : ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్ మొదలు పెడతాను.. మంచు విష్ణు కామెంట్స్..

Manchu Vishnu :  ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’కి సొంత బిల్డింగ్ కట్టిస్తాను అని ప్రకటించాడు. ఇదే స్లోగన్ తో ఎన్నికల్లో ముందుకెళ్లాడు.

Mahesh Babu : మీరెంత చేసినా సినిమా, కలెక్షన్స్ హిట్.. ‘సర్కారు వారి పాట’ నెగిటివ్ ట్రెండ్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ”మరో ఆరునెలలలోపే ‘మా’ బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. ‘మా‌’ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని చాలా మంది విమర్శించారు. ఇప్పుడేమో పెరిగిన టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి, పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము” అని అన్నారు. దీంతో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

×