Manchu Manoj : నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి : మంచు మనోజ్

కొద్ది నెలల క్రితం మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా లేదా అని అభిమానుల్లోనూ, ఇండస్ర్టిలోను అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల మనోజ్

Manchu Manoj :  నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి : మంచు మనోజ్

Manoj

Manchu Manoj :  మంచు వారి కుటుంబంలో చాలా సైలెంట్ గా ఉంటూ అప్పుడప్పుడు సెటైర్ లు వేసేది మనోజ్ ఒక్కడే. ‘మా’ ఎలక్షన్స్ టైంలో మంచు విష్ణు, మోహన్ బాబు, లక్ష్మి ఎలక్షన్స్ పై మాట్లాడారు. ప్రెస్ మీట్స్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ మనోజ్ ఒక్కడే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డైరెక్ట్ ఎలక్షన్ రోజు కనపడ్డాడు. ఎలక్షన్ రోజు కూడా గొడవలు జరిగితే మనోజ్ ఆపాడంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్ళు చెప్పారు. అంతకు ముందు కూడా చాలా సంఘటనల్లో మనోజ్ తన మంచితనాన్ని, మెచ్యూర్డ్ గా ఆలోచించడాన్ని చూపించాడు. మంచు వారి కుటుంబంలో మనోజ్ సినిమాలకి కాకుండా ఆయన వ్యక్తిత్వానికి కూడా సపరేట్ ఫాలోయింగ్ ఉంది.

RGV : తెలుగు ఇండస్ట్రీలో ఆర్జీవీ మరో కొత్త ప్రయోగం.. డిజిటల్ కరెన్సీతో సినిమా కొనొచ్చు

కొద్ది నెలల క్రితం మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా లేదా అని అభిమానుల్లోనూ, ఇండస్ర్టిలోను అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల మనోజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనోజ్ త్వరలో ఓ ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని వైరల్ అయింది. తాజాగా ఈ వార్తలపై మనోజ్ సెటైరికల్ గా స్పందించాడు.

Romantic : ‘రొమాంటిక్’ సెట్ లోంచి పారిపోదాము అనుకున్నా : ఆకాష్ పూరి

ట్విట్టర్ లో ఈ వార్త రాసిన ఓ పేజీని ట్యాగ్ చేస్తూ.. ఆ పెళ్లికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం అంటూ బ్రహ్మానందం ఫోటో పెట్టి సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో అయినా మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లకి పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.