Thiruveer : కష్టాల నుంచి కారు కొనుకొనే స్టేజికి.. ఇక పరేషాన్ లేదంటున్న తిరువీర్‌!

జార్జిరెడ్డి, మసూద, పరేషాన్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు తిరువీర్. ఈ నటుడు కెరీర్ మొదటిలో ఎన్ని కష్టాలు ఎదురుకున్నాడో తెలుసా?

Thiruveer : కష్టాల నుంచి కారు కొనుకొనే స్టేజికి.. ఇక పరేషాన్ లేదంటున్న తిరువీర్‌!

Masooda actor Thiruveer life Pareshan story from career starting

Thiruveer – Pareshan : టాలీవుడ్ నటుడు తిరువీర్.. వరుస ఎంటర్టైనర్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు. ఇటీవల హీరోగా మసూద (Masooda) వంటి హారర్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. తాజాగా ‘పరేషాన్’ సినిమాతో వచ్చి మరో సక్సెస్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో మంచి టాక్ తో ముందుకు సాగుతుంది. ఇక ఈ హిట్టుతో కొత్త కారుని కొనుక్కున్నాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో కారుతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by ThiruveeR (@thiruveer)

Raviteja : రవితేజ కొడుకు కూతురు ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..? ఫోటోలు వైరల్!

ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లు అందుకుంటున్న తిరువీర్.. కెరీర్ లో ఎన్నో సమస్యలు ఎదురుకున్నాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మామిడిపల్లికి చెందిన తిరువీర్‌ కుటుంబం బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. వెంకట్‌రెడ్డి కాటేదాన్‌ పారిశ్రామికవాడలో తిరువీర్ తండ్రి పని చేసేవాడు. పుస్తకాలు కొనుకోవడానికి తిరువీర్ కూడా సెలవులు సమయంలో తండ్రితో పాటు పనికి వెళ్ళేవాడు. సిటీ కాలేజీలో తిరువీర్ డిగ్రీ చేశాడు. ఆ కాలేజీలో షూటింగ్స్ ఎక్కువ జరిగేవట. ఆ సమయంలోనే తనకి సినిమా పై ఆసక్తి కలిగినట్లు చెప్పుకొస్తాడు.

అదే ఆసక్తితో డిగ్రీ తర్వాత ‘ఫైన్‌ ఆర్ట్స్‌’ కోర్సులో చేరాడు. ఆ తరువాత థియేటర్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 45 నాటకాల్లో నటించాడు. కొన్నాళ్లు రెయిన్‌బో ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా, పాఠశాలలో థియేటర్‌ టీచర్‌గా కూడా చేశాడు. తన సినిమా పిచ్చి చూసి ఇంట్లో వాళ్ళు కూడా తిట్టేవారట. కానీ వాళ్ళ అమ్మ మాత్రం తనని నమ్మేవారట. అంతేకాదు నెలకు 5 వేళ్ళు ఇచ్చి ప్రోత్సహించేవారట. ఇక కొన్నాళ్ల తరువాత ‘డాటర్‌ ఆఫ్‌ వర్మ’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. నటుడిగా ‘బొమ్మల రామవరం’ సినిమాతో పరిచయం అయ్యాడు.

Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..

రానా సూపర్ హిట్ మూవీ ‘ఘాజీ’లో కూడా నటించాడు. కానీ దేనిలోను పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తరువాత ఒక ప్రముఖ ఛానల్ లో ఒక షోకి పని చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ‘జార్జిరెడ్డి’ సినిమా తీస్తున్నారు అని తెలిసి ఆ డైరెక్టర్ ని సంప్రదించాడు. ఆ డైరెక్టర్ కి తిరువీర్ కళ్ళలో కోపం, క్రూరత్వం కనిపించి జార్జిరెడ్డిలో నెగటివ్ రోల్ పాత్ర ఇచ్చాడు. ఇక ఆ పాత్రలో నటించి అవార్డుని కూడా అందుకున్నాడు తిరువీర్. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.

పలాస, మల్లేశం, టక్‌ జగదీష్‌ సినిమాలతో పాటు మెట్రో కథలు వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. రీసెంట్ గా మసూద, పరేషాన్ చిత్రాలు. ప్రస్తుతం తిరువీర్ మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. హీరోగా చేయాలనే ఆలోచనతో కాకుండా నటనకి స్కోప్ ఉండే పాత్ర ఏదైనా చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు. తిరువీర్ నటుడి గానే కాదు దర్శకుడిగా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూవీస్ కూడా తీశాడు.