Mega Star Chiranjeevi: ట్రీట్మెంట్ కోసం వైజాగ్‌‌కు చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తవడంతో.. త్వరలో లూసిఫర్ రీమేక్ సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Mega Star Chiranjeevi: ట్రీట్మెంట్ కోసం వైజాగ్‌‌కు చిరంజీవి

Chiranjeevi

Mega Star Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తవడంతో.. త్వరలో లూసిఫర్ రీమేక్ సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అంతకుముందు డీటాక్సిఫికేష‌న్, రెజువెనేష‌న్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైజాగ్‌లోని ఆయుర్వేదిక్ స్పా సెంట‌ర్‌కు వెళ్లారు. చిరు ఇదే స్పా సెంట‌ర్‌లో వారం రోజులు పాటు ఉండనున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా చిరంజీవి వెంట ఉన్నార‌ట‌.

సాధారణంగా టాలీవుడ్ హీరోలు డీటాక్సిఫికేష‌న్ ప్రాసెస్ కోసం విదేశాల‌కు వెళ్తుంటారు. కానీ చిరంజీవి మాత్రం విదేశాల‌కు వెళ్లకుండా వైజాగ్‌లోనే ట్రీట్‌‌మెంట్ చేయించుకుంటున్నారు. స్పా సెష‌న్ పూర్త‌వ‌గానే లూసిఫ‌ర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో స‌త్యదేవ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు.

మ‌ల‌యాళ వెర్ష‌న్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర‌కు స‌రిపోయే హీరో కోసం మరో హీరోను వెతుకుతున్నారు. మోహన్ లాల్‌, పృథ్విరాజ్ సుకుమారన్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన లూసిఫ‌ర్ మాలీవుడ్ లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అభిమానుల‌ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.  మెహ‌ర్‌ర‌మేశ్‌, బాబీ సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.