God Father Trailer: గాడ్ ఫాదర్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అభిమానులను హుషారెత్తించిన మెగాస్టార్..

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ పాదర్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఉండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

God Father Trailer: గాడ్ ఫాదర్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అభిమానులను హుషారెత్తించిన మెగాస్టార్..

God Father Trailer: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ పాదర్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఉండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ ని హుషారెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 12 సెకన్లు నిడివి కలిగిన ట్రైలర్ లో చిరంజీవి కొత్త లుక్ లో కనిపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అభిమానులకు కిక్కిచ్చారు.

Godfather: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఈ ఇద్దరిపైనే అందరి చూపులు!

అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రానుండగా.. నేడు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లో చిరంజీవి యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించిన విషయం విధితమే. స్థానిక నేటివిటీకి తగ్గట్లు లూసిఫర్ కథలో చాలా మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు.